E-Paper
Advertisement

Appalanayudu on Jagan: దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. జగన్ తీరుపై విరుచుకుపడ్డ విజయనగరం ఎంపీ

Appalanayudu on Jagan: దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. జగన్ తీరుపై విరుచుకుపడ్డ విజయనగరం ఎంపీ
Advertisement

Appalanayudu on Jagan: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ వ్యవహారశైలిని తప్పుబడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రజా సమస్యల మీద చర్చించాల్సిన అసెంబ్లీకి రాకుండా, బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లి ప్యాలెస్‌లోని నాలుగు గోడల మధ్య పిల్లిలా కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారని అప్పలనాయుడు ఎద్దేవా చేశారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వ్యవహరించాల్సింది పోయి, కేవలం మీడియా ముందు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

Advertisement

రాష్ట్ర ఆర్థిక వనరులు, వ్యవస్థ గురించి జగన్ మాట్లాడుతుంటే ‘దయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉందని ఎంపీ విమర్శించారు. తన ఐదేళ్ల పాలనలో మున్సిపల్ ఆఫీసులను సైతం తాకట్టు పెట్టిన చరిత్ర జగన్‌దని, దేశంలో ఎక్కడా లేని వింత పాలసీలతో రాష్ట్రాన్ని దివాలా తీయించారని ధ్వజమెత్తారు. కేంద్రానికి లేఖ రాస్తానని జగన్ అంటున్నారని, అయితే ఆయన హయాంలో జరిగిన అరాచకాల చిట్టా మొత్తం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందని గుర్తు చేశారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని జగన్ అనడం హాస్యాస్పదమని అప్పలనాయుడు అన్నారు. సొంత కన్నతల్లికి, చెల్లికి జగన్ ఎంత రక్షణ ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. కేవలం రాజకీయాల కోసం సొంత చెల్లెలుపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించి ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. అదే విధంగా సొంత మద్యం బ్రాండ్లతో వేల కోట్లు గడిస్తూ, సుమారు 30 వేల మంది మహిళల తాళిబొట్లు తెంపిన పాపం జగన్‌దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Also Read:  ‘మీ బాస్ ఇచ్చిన లేఖ మర్చిపోయారా’? టీడీపీ ఎంపీకి చామల చురకలు

Related News

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

Big Stories

Advertisement
×