E-Paper
Advertisement

TDP : తెలుగుతమ్ముళ్లకు, పార్టీకి ఆ చింత తీరినట్టేనా?

TDP : తెలుగుతమ్ముళ్లకు, పార్టీకి ఆ చింత తీరినట్టేనా?
Advertisement

తెలుగుదేశం పార్టీకి, తెలుగుతమ్ముళ్లకు ఇంతకాలం ఉన్న చింత తీరిపోయినట్టు తెలుస్తున్నది.ఎందుకంటే సందర్భం ఏదైనా చంద్రబాబు తర్వాత ఎవరు? అనే బెంగ వారికి ఉండేది. ఇంతకాలం పార్టీని పెద్దాయన ముందుండి నడిపించారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనకు వయసు మీద పడుతోంది. ఇప్పటికే ఆయన కేంద్ర,రాష్ట్ర రాజకీయాల్లో పలుమార్లు చక్రం తిప్పారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.ఇప్పుడు కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూలిపోకుండా చంద్రబాబే తన మద్దతును ప్రకటించారు. కేంద్రంలో సర్కారు నిలబడాలన్నా.. కూలాలన్న బాబు చేతుల్లోనే నిర్ణయం ఉన్నది. అందుకు బదులుగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను దగ్గరుండి మరీ కేంద్రం నుంచి తీసుకొస్తున్నారు.ఇక్కడ కూడా చంద్రబాబు రాజనీతికి పనిచెప్పారు.

తారక్ కాదు.. లోకేశ్..

2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనప్పుడు చంద్రబాబు పని అయిపోయిందని, పార్టీకి కొత్త నాయకత్వం రావాలని అంతా ఆకాక్షించారు.అందులో తెలుగు తమ్ముళ్లు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అప్పటివరకు ప్రజలకు, ఇటు పార్టీ నేతలకు నారా లోకేశ్ మీద పెద్దగా నమ్మకం ఉండేది కాదని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. గతంలో నారాలేకేశ్ మంత్రిగా పనిచేసిన ఆయనకు పెద్దగా పొలిటికల్ నాలెడ్జ్ లేదని చర్చ జరిగింది.కొందరు సీనియర్లు సైతం లోకేశ్ నాయకత్వం మీద నమ్మకంగా లేరని తెలిసింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని కొంత ప్రచారం జరిగింది. ఆయన ఫ్యాన్స్ సైతం ఫ్యూచర్ సీఎం, సీఎం అని ఎక్కడకు వెళ్లినా హోరెత్తించేవారు. చంద్రబాబు తర్వాత తారక్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరి నుంచి డిమాండ్లు సైతం వినిపించాయి.

చంద్రబాబు అరెస్టుతో సీన్ రివర్స్..

Advertisement

గత వైసీపీ పాలనలో చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేశాక సీన్ రివర్స్ అయ్యింది.ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉందనే సమయంలో బాబు అరెస్టు అయ్యారు. అప్పుడు పార్టీని ముందుండి ఎవరు నడిపిస్తారని చర్చ జరిగింది. ఒక్కసారిగా కేడర్, సీనియర్ నేతలంతా కామ్ అయ్యారు. పార్టీలో అంధకారం అలుముకున్నది. అదే సమయంలో నారా లోకేశ్.. ఇటు టీడీపీ, జనసేన మళ్లీ పొత్తు పొడిచేలా కీలకంగా వ్యవహరించారని తెలిసింది. చంద్రబాబును జైలులో చూశాక పవన్ మనస్సు మార్చుకున్నారని.. మరోసారి కలిసి పోటీ చేసేందుకు జైలు బయటే మీడియాతో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని ఎన్డీయేతో కలిసేలా పవన్ ఒప్పించిన విషయం కూడా విదితమే.

Harishrao: అసెంబ్లీ సమావేశాలు ముగింపు.. హాట్ కామెంట్స్ చేసిన హరీష్‌రావు, కేవలం అందుకోసమేనా

యువగళం అదుర్స్..

Advertisement

చంద్రబాబు జైలులో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నారాలోకేశ్ ఎంతో కృషి చేశారు. యువగళం పేరిట పాదయాత్రను చేపట్టి..వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు.. తన తండ్రిని జైలులో పెట్టించడం, తన తల్లిని అసెంబ్లీ వేదికగా అవమానించారని బలంగా తన వాయిస్ వినిపించారు. 2019లో మంగళగిరిలో ఓడిన లోకేశ్.. 2024 ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంలోనూ, సిక్స్ గ్యారెంటీస్ అమలు, రెడ్ బుక్ పేరిట వైసీపీ మాజీ మంత్రులు, అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టేలా చేయడంలో లోకేశ్ స్టైలే వేరు అనే స్థాయికి ఎదిగాడు. ఎవరైతే లోకేశ్ నాయకత్వం కింద పనిచేయము అని అన్నారో..ఆయన లీడర్‌గా పనికిరారు అన్నారో.. వారే స్వయంగా తన నాయకత్వాన్ని అంగీకరించే స్థాయికి వెళ్లారు. తన తండ్రి అరెస్టు.. తన తల్లికి జరిగిన అవమానాన్ని ఆయన తీసుకోలేకపోయారనేది అక్షర సత్యం. అందుకే తారక్ నాయకత్వం కావాలనేకునే వారంతా ఇప్పుడు లోకేశ్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్దంగా ఉన్నారంటే .. యువ నాయకుడి పనితీరును ఇట్టే తెలిసిపోతుంది.

 

 

 

 

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×