E-Paper
Advertisement

సెలబ్రిటీ బ్రాండ్ ఇమేజ్‌పై బీజేపీ కన్ను.. బెంగాల్ స్టార్ క్యాంపెయినర్‌గా లియాండర్ పేస్

సెలబ్రిటీ బ్రాండ్ ఇమేజ్‌పై బీజేపీ కన్ను.. బెంగాల్ స్టార్ క్యాంపెయినర్‌గా లియాండర్ పేస్
Advertisement

Leander Paes joins BJP: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతుంటాయి. అయితే భారతీయ జనతా పార్టీ (BJP) మాత్రం ప్రతి ఎన్నికల్లో ఒక ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తుంది. అదే సినిమా, స్పోర్ట్స్ రంగాలకు చెందిన ప్రముఖులను రంగంలోకి దించి, వారికున్న పాపులారిటీని.. బ్రాండ్ ఇమేజ్‌ను ఓట్లుగా మలుచుకోవడం. ఇప్పుడు తాజాగా అదే వ్యూహంతో టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ను బీజేపీ తన గూటికి చేర్చుకుంది.

టెన్నిస్ కోర్టులో తన అద్భుతమైన ఆటతీరుతో దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన లియాండర్ పేస్, మంగళవారం ఢిల్లీలో అధికారికంగా రాజకీయ అరంగేట్రం చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. “గత 40 ఏళ్లుగా క్రీడాకారుడిగా దేశానికి సేవ చేశాను. ఇప్పుడు రాజకీయాల ద్వారా యువతకు, క్రీడా రంగానికి సేవ చేసేందుకు ఈ వేదికను ఎంచుకున్నాను.” అని తన మనసులోని మాటను పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఖేలో ఇండియా వంటి పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

భారత టెన్నిస్ చరిత్రలో ఒలింపిక్ పతకం సాధించిన ఏకైక క్రీడాకారుడిగా పేస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పేస్, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా కీలక పాత్ర పోషించనున్నారు. బెంగాల్ యువతలో ఆయనకున్న విపరీతమైన క్రేజ్‌ను ఉపయోగించుకుని, అక్కడ పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ వేసింది. గతంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరినప్పటికీ, అక్కడ క్రియాశీలకంగా లేకపోవడంతో ఇప్పుడు బీజేపీలోకి మారడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బెంగాల్ మట్టి బిడ్డగా, ప్రసిద్ధ కవి మైఖేల్ మధుసూదన్ దత్ వారసుడిగా పేస్ చేరిక తమకు కొండంత బలాన్నిస్తుందని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

లియాండర్ పేస్ చేరిక కేవలం పశ్చిమ బెంగాల్‌కే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను ఆకట్టుకునే అవకాశం ఉంది. క్రీడాకారులకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా గుర్తింపు పొందాలని చూస్తున్న బీజేపీకి, పేస్ వంటి అంతర్జాతీయ స్థాయి ఐకాన్ దొరకడం ఒక పెద్ద ప్లస్ పాయింట్. బెంగాల్‌లో మమతా బెనర్జీని ఢీకొట్టేందుకు బీజేపీ అనుసరిస్తున్న సెలబ్రిటీ పాలిటిక్స్స‌ లో భాగంగానే పేస్ ఎంట్రీ జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Read Also: ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానా ఖాళీ.. నెల రోజుల్లోనే రూ.2.63 లక్షల కోట్లు హాంఫట్!

Related News

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

Big Stories

Advertisement
×