Chandrababu naidu arrest news updates : ఇల్లా..? జైలా..? కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

Chandrababu arrest updates: ఇల్లా..? జైలా..? కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

Arguments in ACB court on Chandrababu House remand petition
Share this post with your friends

Chandrababu naidu arrest news updates

Chandrababu naidu arrest news updates(Breaking news in Andhra Pradesh) :

చంద్రబాబు హౌస్‌ రిమాండ్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఖైదీ నెంబర్‌ 7691గా ఉన్నారు. చంద్రబాబును హౌస్ రిమాండ్ లో ఉంచాలని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. హౌస్ రిమాండ్ అవసరం లేదని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు..
చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో పటిష్ట భద్రత కల్పించామన్నారు. జైలులో ప్రత్యేక గది కేటాయించామని అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. చంద్రబాబు భద్రతపై తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డీజీ ఇచ్చిన ఆదేశాల లేఖను కోర్టు ముందుంచారు. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడి భధ్రతా బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కోరిన‌ విధంగా కోర్టు ఆదేశాలతో ఇంటి భోజనం, మందులు అందిస్తున్నామన్నారు. హౌస్ రిమాండ్ పిటిషన్ కొట్టివేయాలని కోరారు.

ఏఏజీ పొన్నవోలు వాదనలు..
ఏపీ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. చంద్రబాబుకు ఇంట్లో కన్నా జైల్లోనే సెక్యూరిటీ ఉంటుందని స్పష్టం చేశారు. రాజమండ్రి జైలుకు 50 అడుగుల ఎత్తైన గోడ ఉందన్నారు. అక్కడికి ఎవరు రాలేరన్నారు. చంద్రబాబుకు జైల్లో పూర్తిస్థాయి సెక్యూరిటీ కల్పించామని చెప్పారు. జైలు పరిసరాల్లోనూ పోలీసు సెక్యూరిటీ ఉందని వివరించారు. 24 గంటలు పోలీసులు డ్యూటీలో ఉన్నారని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్స్ 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు. చంద్రబాబుకు ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అందువల్ల హౌస్ రిమాండ్ అవసరం లేదన్నారు. ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు..
చంద్రబాబుకు జైలులో ప్రమాదం ఉందని ఆయన తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు ఇప్పటివరకు ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఆయనకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు.
హౌస్‌ కస్టడీకి సంబంధించి గౌతం నవార్కర్‌ కేసును ఉదహరించారు.హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్న భద్రత పెంపు ఆదేశాలు అమల్లో ఉన్నాయని వెల్లడించారు.
చంద్రబాబును హౌస్‌ రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

MCD : ఢిల్లీలో కాషాయ కోట బద్దలు.. ఆప్ ఘన విజయం..

BigTv Desk

Sports Streaming App: నష్టాల్లో స్పోర్ట్స్ స్ట్రీమింగ్ యాప్.. త్వరలోనే మూసివేత..

Bigtv Digital

AP Central University : ఏపీ సెంట్రల్‌ వర్సిటీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం..

BigTv Desk

Sandeep Reddy Vanga : ఇది యానిమల్.. అది డెవిల్.. సందీప్ రెడ్డి వంగా షాకింగ్ స్టేట్మెంట్..

Bigtv Digital

Boy : వీధి కుక్కలకు మరో బాలుడి బలి.. కాజీపేటలో దారుణం..

Bigtv Digital

Manifesto : భవిష్యత్తుకు గ్యారంటీ .. టీడీపీ తొలి విడత మేనిఫెస్టో విడుదల..

Bigtv Digital

Leave a Comment