Big Stories

Atchannaidu : స్కిల్ డెవలప్ మెంట్ కేసు.. హైకోర్టులో అచ్చెన్నాయుడికి ఊరట..

atchannaidu news today

- Advertisement -

AP Skill Developement Case(Political news in AP): టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి స్కిల్ డెవలప్ మెంట్ కేసు(ap skill development case)లో ఊరట లభించింది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ చేసింది. అచ్చెన్నాయుడిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లో.. యువత ఉపాధి, వ్యవస్థాపకతను ప్రోత్సించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సిమెన్స్ ఇండియాతో ఎంఓయూ ఒప్పందాన్ని చేసుకుంది అప్పటి టిడిపి ప్రభుత్వం. ఇందులో 10 శాతం ఖర్చును ప్రభుత్వం పెట్టుకుంటే.. 90 శాతం ఖర్చు సీమెన్స్ గ్రాంట్ గా ఇవ్వాలన్నది ఒప్పందం సారాశం. 2015లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC)ను స్థాపించారు.

Also Read : ఆ 7 హామీల సంగతేంటి ? జగన్‌కు చంద్రబాబు ప్రశ్నలు..

రూ.3,356 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి 2021లో జరిగిన ఏపీ అసెంబ్లీలో పెద్ద స్కామ్ గా అభివర్ణించారు. 2021 డిసెంబర్ లోనే చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల్లో రూ.241 కోట్లను షెల్ కంపెనీలకు పంపారన్న ఆరోపణలున్నాయి.

2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో గంటా శ్రీనివాసరావును కూడా విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్ 20న ఏపీ హైకోర్టు చంద్రబాబుకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News