BigTV English

Mahabubnagar MLC Bypoll : మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్.. ఓటేసిన సీఎం రేవంత్

Mahabubnagar MLC Bypoll : మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్.. ఓటేసిన సీఎం రేవంత్


Mahabubnagar MLC Bypoll(Political news in telangana): మహబుబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ జరగనుంది. కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఆయన ఓటు వేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ 57.33 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కాగా.. మొత్తం 1439 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పురపాలక కౌన్సిలర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1439 మంది ఓటర్లలో 900 మంది  గతంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులే. కానీ.. వీరిలో చాలా మంది ఇప్పటికే హస్తం గూటికి చేరారు. ఇంకొందరు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ కు క్రాస్ ఓటింగ్ పడుతుందని బీఆర్ఎస్ భయపడుతోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని తెలుస్తోంది.


ఎమ్మెల్సీ ఉప ఎన్నికకై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలవుతోంది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 2న ఉపఎన్నిక ఫలితం వెలువడనుంది.

Also Read : కాంగ్రెస్ ఎనిమిదో జాబితా విడుదల.. భువనగిరి నుంచి చామల కిరణ్ పోటీ..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1439 మంది ఓటర్లలో 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు 14 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.

ఇక్కడ అధికార కాంగ్రెస్ నుంచి.. టిటిడి బోర్డు మాజీ మెంబర్ జీవన్ రెడ్డి బరిలో ఉండగా.. బీఆర్ఎస్ తరఫున జడ్పీ మాజీ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్ గా సుదర్శన్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఎలాగైనా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ తపన పడుతుండగా.. అధికార కాంగ్రెస్ ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఏ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయో చూడాలి.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×