Big Stories

The Goat Life Movie Twitter Review: పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’ ట్విట్టర్ రివ్యూ.. 16 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందా..?

The Goat Life
The Goat Life

The Goat Life Movie Twitter Review: ఒక చిన్న సినిమా తీయాలంటే కనీసం 6 నుంచి 12 నెలల సమయం పడుతుంది. అదే భారీ బడ్జెట్ మూవీ అయితే కనీసం ఒకటి లేదా రెండు ఏళ్లు పడుతుంది. కానీ ఇక్కడ ఒక సినిమాని తెరకెక్కించడానికి దాదాపు 16 ఏళ్లు పట్టింది.

- Advertisement -

ఆ సినిమా కోసం హీరో, డైరెక్టర్ సహా మిగతా యూనిట్ అంతా ఎంతో శ్రమించింది. ఎండ, వాన అనే తేడా లేకుండా చిత్రీకరణను జరుపుకుంది. కరోనా మహమ్మారి సమయంలోనూ ఎక్కడా తగ్గలేదు. మొత్తం చిత్రబృందం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చిత్రీకరణ జరుపుకుంది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్‌కు వచ్చింది. ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ప్రముఖ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘ది గోట్ లైఫ్’. తెలుగులో ‘ఆడుజీవితం’ పేరుతో తమిళం, తెలుగులో రిలీజ్ అయింది. డైరెక్టర్ బ్లెస్సీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

బెన్యామిన్ రచించిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నిజ జీవితం సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. 2008లో స్టార్ట్ అయిన ఈ చిత్రం అన్నిపనులు పూర్తి చేసుకుని 2024 మార్చి 28న రిలీజ్ అయింది. ఈ ఒక్క సినిమా కోసం హీరో పృథ్వీరాజ్ 16 ఏళ్లు కష్టపడ్డాడు.

Also Read: రాజులా ఉండే వాడిని.. ఇప్పుడు బానిస అయ్యాను: స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై ఫుల్ హైప్ పెంచేశాయి. ఫస్ట్ నుంచే భారీ అంచనాలున్న ఈ సినిమాను చూసేందుకు సినీ ప్రియులు థియేటర్లలకు పరుగులు పెట్టారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను చూసి చాలా మంది ట్విట్టర్ వేదికగా స్పందింస్తున్నారు.

పృథ్వీరాజ్ ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డాడో ఇప్పుడు అర్థం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. అతడు ఈ ఒక్క సినిమా కోసం ఇంత దూరం వెళ్తాడని ఎప్పుడూ అనుకోలేదని అంటున్నారు. అలాగే దర్శకుడు బ్లెస్సీ తన అద్భుతమైన ఆలోచనతో సినిమాను తెరకెక్కించారని చెబుతున్నారు.

కాగా మూవీ ఫస్ట్ హాఫ్ అత్యద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ 16ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందని అంటున్నారు. అంతాకాకుండా సెకండాఫ్ అందరిలోనూ క్యూరియాసిటీ పెంచేస్తుందని.. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ అయితే మరో రేంజ్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తాయని ట్వీట్లు చేస్తున్నారు.

Also Read: ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చేసింది బాసూ.. ఎలా ఉందో మీరూ చూసేయండి

అలాగే ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ కూడా బాగుందని అంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే.. పృథ్వీరాజ్ మరోసారి బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారని చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News