Ram Charan Peddi:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టేటస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ ఆ తర్వాత అంతే స్థాయిలో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా చేశారు. కానీ మొదటి రోజే డిజాస్టర్ గా నిలిచింది.
సంక్రాంతి బరిలో నిలిచి రెండు రోజులు కూడా థియేటర్లలో నిలవలేకపోయింది ఈ సినిమా. దీంతో భారీ దెబ్బ చూసిన రాంచరణ్ ఎలాగైనా సరే అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వాలి అని.. ఉప్పెన (Uppena ) సినిమాతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో ‘ పెద్ది’ అనే టైటిల్ తో ఇప్పుడు రామ్ చరణ్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అంతేకాదు ఈ సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ షాట్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి
పెద్ది సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేయనున్నారా?
దీనికి తోడు డైరెక్టర్ బుచ్చిబాబు కూడా అప్పుడప్పుడు సినిమా సెట్ నుండి కొన్ని ఫోటోలను ప్రత్యేకంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఈ పెద్ది సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నట్లు కూడా మనకు ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఇక మాసివ్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రామ్ చరణ్ సిద్ధమవుతున్నారు.
పెద్ది సినిమా నటీనటులు..
ఇదిలా ఉండగా.. సినిమా షూటింగ్ ఒకవైపు జరుగుతుండగానే.. అప్పుడే ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా అమ్ముడుపోయాయి. ఇకపోతే ఈ సినిమాకి వృద్ధి సినిమాస్ పతాకం పై వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi kapoor)హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శివరాజ్ కుమార్(Shiva Raj Kumar), జగపతిబాబు (Jagapathi Babu), దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
భారీ ధరకు అమ్ముడుపోయిన పెద్ది ఓటీటీ హక్కులు..
ఇదిలా ఉండగా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన అంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది.కానీ అప్పుడే ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఏ రేంజ్ లో అంటే అప్పుడే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయింది అనడంలో సందేహం లేదు. అసలు విషయంలోకి వెళితే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Net Flix) పెద్ది సినిమా హక్కులను సొంతం చేసుకుందట. అంతేకాదు అన్ని భాషలలో కలుపుకొని మొత్తం రూ.105 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అటు థియేటర్లలో విడుదలైన 8 వారాలకు ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయాలి అని మేకర్స్ తో ఒప్పందం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విడుదలకు ముందే ఓటిటి హక్కులు ఈ రేంజ్ లో జరిగాయి అంటే ఇక నాన్ థియేట్రికల్, సాటిలైట్ హక్కులు ఏమేరా బిజినెస్ జరుగుతుందో చూడాలి. మొత్తానికైతే విడుదలకు ముందే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయింది ఈ సినిమా.
ALSO READ:HBD Sindhu Menon: చందమామ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎక్కడ, ఏం చేస్తోందో తెలుసా?