Finger Millets: రాగులను ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. రాగులను శతాబ్దాలుగా ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తున్నారు. వీటిలో అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు , ఫైబర్‌తో సహా అనేక పోషకాల ఉంటాయి. ఊబకాయం, మైగ్రేన్, గుండె జబ్బులు, ఒత్తిడి ,మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రాగులను తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. రాగులను తరచుగా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాగులు అత్యంత పోషకాలు ఉన్న మిల్లెట్. ఇవి ఆవాలను పోలి ఉంటాయి. రాగి శాస్త్రీయ నామం ఎలుసిన్ కొరాకానా . ఇందులో కాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ ,యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.
రాగి ఆరోగ్య ప్రయోజనాలు:
నిద్రకు మేలు చేస్తుంది:
రాగిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని తరుచుగా తినడం వల్ల ఆందోళన, నిరాశ , నిద్ర సమస్యలను తగ్గిస్తుంది. రాగులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మధుమేహం:
ఇతర మిల్లెట్స్‌తో పోలిస్తే రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇందులో మంచి మొత్తంలో పాలీఫెనాల్స్ , ఫైబర్ కూడా ఉన్నాయి. రాగులను తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలకు ప్రయోజనకరంగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో సహాయపడటానికి మీరు అల్పాహారంగా రాగి రోటీని కూడా తినవచ్చు.
బరువు తగ్గడం:
మీరు స్థూలకాయంతో బాధపడుతున్నట్లయితే, రాగులను తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అందుకే దీన్ని తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయదు. అందువల్ల, మీరు రాగులు తినడం ద్వారా బరువు కూడా ఈజీగా తగ్గవచ్చు.
కొలెస్ట్రాల్‌ను తగ్గుతుంది:
రాగి గుండెకు మంచిదని భావిస్తారు. ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్ , ఫైటిక్ యాసిడ్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు రాగులను తరచుగా మీ డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఐరన్ లోపాన్ని అధిగమించండి:
మీరు ఐరన్ లోపంతో బాధపడుతున్నట్లయితే రాగులను తినడం మంచిది. రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఫలితంగా మీ శరీరంలో ఐరన్ లోపం ఉండదు. మీరు రక్తహీనత బాధపడుతుంటే గనక రాగులు తింటే మీరు ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు.
రాగులు పిల్లలకు మేలు చేస్తాయి:
రాగుల్లో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే రాగి చిన్న పిల్లలకు ఇవి సూపర్ ఫుడ్. పిల్లల ఎముకల సక్రమ అభివృద్ధికి రాగులను తినిపించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పిల్లల్లో రక్తహీనతను నివారిస్తుంది. పిల్లల రోగనిరోధక వ్యవస్థలకు కూడా రాగి మంచి ఎంపిక. మీరు పిల్లలకు రాగి ఖిచ్డీ తినిపించవచ్చు.
Also Read: ఇలా చేస్తే.. తెల్ల జుట్టు రమ్మన్నా రాదు
రాగుల వల్ల కలిగే నష్టాలు ఏమిటి ?
కొంతమంది రాగులను తినకుండా ఉండాలి. మీకు కిడ్నీ సమస్యలు ,రాళ్లు ఉన్నట్లయితే మీరు వైద్యుడిని సంప్రదించకుండా రాగులు తినకూడదు. థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు కూడా రాగులకు దూరంగా ఉండాలి. వీటి యొక్క వెచ్చని స్వభావం కారణంగా, వేసవిలో రాగులను ఎక్కువగా తినకూడదని సలహా ఇస్తారు. మీకు జీర్ణ సమస్యలు ఉంటే, వీటిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి.