BigTV English

Balayya Slapped a Fan: అభిమానిపై చెయ్యి చేసుకున్న బాలయ్య.. దబిడి దిబిడే!

Balayya Slapped a Fan: అభిమానిపై చెయ్యి చేసుకున్న బాలయ్య.. దబిడి దిబిడే!

Balakrishna Slapped a Fan in Swarnandhra Saakara Yatra: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో.. అధికార, ప్రతిపక్షాల పార్టీల అభ్యర్థులు ప్రచారాలు ముమ్మరం చేస్తున్నారు. కూటమి నేతలు ఇప్పటికే ప్రజాగళం, వారాహి విజయయాత్ర పేరిట సభలు నిర్వహిస్తుండగా.. అధికార వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తోంది. ఇక హిందూపురం ఎమ్మెల్యే, టిడిపి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ కూడా స్వర్ణాంధ్ర సాకారయాత్ర పేరిట ప్రచారానికి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇంకా ప్రచారమైనా మొదలుపెట్టకముందే బాలకృష్ణ తనదైన శైలిలో దబిడి దిబిడి షురూ చేశారు.


సత్యసాయి జిల్లాలో పర్యటన సందర్భంగా కదిరికి చేరుకున్నారు బాలకృష్ణ. హెలికాఫ్టర్ దిగిన బాలయ్యతో ఫొటో దిగేందుకు అభిమానులు పోటీపడగా.. ఒక అభిమానిపై ఆయన చెయ్యి చేసుకున్నారు. సెల్ఫీకోసం వచ్చిన అభిమానిపై బాలయ్య చెయ్యిచేసుకోగా.. పక్కనే ఉన్న టిడిపి నేతలు ఆ అభిమానిని దూరంగా పంపేశారు. దీంతో బాలయ్యకు మరీ ఇంత కోపమేంటంటున్నారు అభిమానులు.

Also Read : అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు కుర్రాడు.. ఎవరీ గోపీచంద్ తోటకూర


కాగా.. కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు, దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం బాలకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్నారు. సాయంత్రం కదిరి కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగిస్తారు. అనంతరం పుట్టపర్తి కొత్తచెరువు సర్కిల్ లో జరిగే బహిరంగ సభలోనూ పాల్గొంటారు. రాత్రికి అనంతపురంలో బస చేస్తారు. బాలకృష్ణ యాత్ర చేయనున్న బస్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. బాలయ్య అన్ స్టాపబుల్ పేరుతో డిజైన్ చేసిన బస్సు ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 19న బాలకృష్ణ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ లోగా రాయలసీమలో స్వర్ణాంధ్రసాకార యాత్రను పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×