BigTV English

Movie on Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంపై మూవి.. డైరక్ట్ గా ఓటీటీలోకి స్ట్రీమింగ్..

Movie on Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంపై మూవి.. డైరక్ట్ గా ఓటీటీలోకి  స్ట్రీమింగ్..

Movie on Ayodhya Ram Mandir: ఆ ఏడాది జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదగా 100 కోట్ల మంది హిందువుల కళ అయిన అయోధ్య రామమందిరం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ ఆలయంలో 51 అడుగుల పొడవైన బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.


ఈ మహోత్తర కార్యక్రమాన్ని చూసి యావత్తు భారతదేశం భక్తి పరవసంతో పులకించిపోయింది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం రోజు రోజుకి భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగా త్వరలో అయోధ్య రామమందిరంపై తెలుగులో ఓ డాక్యుమెంటరీ సినిమా రాబోతుంది. “రామ అయోధ్య” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆహా ఓటీటీలో ఏప్రిల్ 17 శ్రీరామ నవమి రోజున స్ట్రీమింగ్ కానుంది.

Also Read: మలయాళ ఇండస్ట్రీ.. మరో హిట్ పట్టేసింది మావా..


ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నర్ సత్య కాశీ భార్గవ రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించాడు. ఆ శ్రీరామ నవమికి అయోధ్య రామయ్య మీ ఇంటికి అంటూ చిత్ర బృందం ట్వీట్ చేస్తూ.. స్ట్రీమింగ్ వివరాలు ఆహా ఓటీటీలో పేర్కొంది. అయితే ఈ చిత్రంలో అయోధ్య రామ్ మందిర్  గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను చూపించబోతున్నట్లు టాక్.

శ్రీరాముడిని జన్మభూమిగా పేరొందిన అయోధ్య పట్టణ విశేషాలతో పాటు హిందువులకు రామమందిరంతో ముడిపడిన భక్తి బంధాన్ని రామ అయోధ్య సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం. అలాగే రామ మందిరం ఏర్పాటు అయినప్పటి నుంచి నిర్మాణ పనులు అక్కడ విశేషాలను క్షుణ్ణంగా ఈ సినిమాలో చూపిస్తున్నట్లు సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×