Big Stories

Balineni: బాలినేని దారేది? ధిక్కారాన్ని జగన్ సహిస్తారా? వైసీపీ లైట్ తీసుకుందా?

Balineni: మాజీ మంత్రి బాలినేని దారేది? వైసీపీ ఆయన్ను లైట్ తీసుకుందా? పార్టీ చీఫ్‌నే ఆయన లైట్ తీసుకున్నారా? సీఎం జగన్‌తో సమావేశమైన బాలినేని.. రీజనల్ కోర్డినేటర్ పదవికి రాజీనామాపై వెనక్కు తగ్గేది లేదని చెప్పారు. అందుకు భిన్నంగా ఉంది సజ్జల రియాక్షన్. ఇంతకీ.. బాలినేని మదిలో ఏముంది? తనను ధిక్కరించడాన్ని సీఎం జగన్ సహిస్తారా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది బాలినేని భవిష్యత్ వ్యూహం.

- Advertisement -

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే చక్రం తిప్పిన నాయకుల్లో ఒకరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాసన్న పేరు చెప్తే ఆ వెయిట్ వేరే ఉండేది. అలాంటిది ఇప్పుడాయన్ను పట్టించుకునే వాళ్లు తగ్గిపోయారా? కేబినెట్ నుంచి తప్పించడం.. మంత్రి పదవి లేకున్నా నీ గౌరవం తగ్గదని చెప్పి జగన్ కార్యక్రమంలో ప్రోటోకాల్ పేరుతో అడ్డుకోవడం బాలినేని ఆగ్రహానికి దారితీసింది. ఆ అవమానంపై సీఎం జగన్ అక్కడే నచ్చజెప్పారు కూడా. అయినా కాంప్రమైజ్ కాలేకపోయారు బాలినేని.

- Advertisement -

వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడం వైసీపీలో కలకలం రేపింది. ఎందుకంటే ఈయన సీఎంకు బంధువు కూడా. వైఎస్ కుటుంబానికి లాయలిస్ట్. అందుకే, తాడేపల్లికి పిలిపించుకుని మరీ బుజ్జగించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈసారి కూడా బాలినేని వెనక్కు తగ్గడం లేదు. డీఎస్పీ పోస్టింగ్ కూడా వేయించుకోలేకపోతే ఇక నేనెందుకు, నాకీ పార్టీ ఎందుకన్నది బాలినేని వాదనగా చెప్తున్నారు. నియోజకవర్గంలో సమస్యల కారణంగా పార్టీ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేనని చెప్తున్నా.. వైసీపీ అధినాయకత్వంలో, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో అనుమానాలు. బాలినేని అలకపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇది పార్టీ అంతర్గత వ్యవహారంగా చెప్పుకొచ్చారు. అసలది ఇష్యూనే కాదని చెప్పారు.

బాలినేని విషయంలో వైసీపీ వైఖరి మారినట్టు జిల్లాలో టాక్. ఎందుకంటే.. పార్టీ వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ శ్రీనివాసులు రెడ్డిపై హైమాండ్‌కూ ఫిర్యాదులు వెళ్లాయి. ఏదో కింది స్థాయి నాయకులు చేసిన ఫిర్యాదులు కావవి. బాలినేనిపై కంప్లయింట్ చేసినవారిలో పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఉన్నట్టు సమాచారం. పార్టీ విషయంలో సీరియస్‌గా లేరని బాలినేని జెండా పీకేస్తారని నడుస్తోంది. మరోవైపు.. జనసేనలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామన్నారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు. మరి, బాలినేని దారేది?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News