Anand Mahindra finds Monday Motivation Post on Virat Kohli: విరాట్ కొహ్లీ పేరు వింటే అందరికీ ఒక పోరాట యోధుడు గుర్తొస్తాడు. యుద్ధంలో చివరి వరకు పోరాడే వీరుడు కనిపిస్తాడు. అంత ఎనర్జీతో ఉంటాడు. అంతే కాదు వందకి, రెండు వందల శాతం ఎఫర్టు పెట్టి ఆడతాడు. అంతేకాదు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడు. అదే మాటను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర కూడా అనడం.. ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించిన బెంగళూరు జట్టుపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. అందులో ఆనంద్ మహీంద్రా ట్వీట్ ని అందరూ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ఒకదశలో వెనుకపడిన ఆర్సీబీ మళ్లీ పుంజుకుని ప్లే ఆఫ్ కు చేరుకుంటుందని ఎవరు అనుకున్నారు? అలాంటి జట్టుని ముందుకు తీసుకువెళ్లిన కొహ్లీకన్నా స్ఫూర్తినిచ్చేవారు, ఇంక ఎవరుంటారని ఆయన ప్రశంసించారు.
పొరపాట్లు జరిగినప్పుడు, కిందపడినప్పడు వాటిని సరిదిద్దుకుని, మళ్లీ పైకి లేచేవాళ్లంటే నాకెంతో ఇష్టం. మా కంపెనీ కూడా అటువంటి వారికి అండగా ఉంటుంది. అదే మా విజయ రహస్యమని అన్నారు. ఏదో గ్రహపాటుగా ఒక పొరపాటుగా జరిగితే, దానిని పట్టుకుని ఆ ఉద్యోగులను వేధించే పద్ధతి మా సంస్థలో లేదని అన్నారు.
Also Read: టీ 20 ప్రపంచకప్ కు ఎంపికైన వారిలో.. ఐదుగురే ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ ఆడుతున్నారు
అలాంటి ఉద్యోగులకి సానుకూల వాతావరణం కల్పించి, వారు నేర్చుకునే దిశగా ప్రేరణ కల్పిస్తామని అన్నారు. అలా ఎందరో నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని అన్నారు. వారినెల్లప్పుడూ ప్రోత్సహిస్తుంటాం, అభినందిస్తుంటామని తెలిపారు.
అందుకే పడిపోయిన ఆర్సీబీ జట్టుని ప్లే ఆఫ్ వరకు నిలబెట్టిన కొహ్లీ లాంటి ఆటగాళ్లను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందని అన్నారు. నా మైండ్ సెట్ కి తగిన వ్యక్తి విరాట్ కొహ్లీ అని కొనియాడారు. ఈ మండే మోటివేషనల్ లో కొహ్లీ, బెంగళూరు జట్టుకన్నా స్ఫూర్తినిచ్చే వారు, విద్యార్థులు, యువతకు మరెవరు ఉంటారని తెలిపారు. ఈ పోస్టుపై పలువురు మీరు చెప్పింది అక్షరాల నిజమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Virat Kohli Security Threat: మరికాసేపట్లో ఎలిమినేటర్.. విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు..
నిజానికి ఆర్సీబీ మొదటి 8 మ్యాచ్ ల్లో ఒక్కటంటే ఒక్కటే గెలిచి ఏడు మ్యాచ్ లు ఓడిపోయింది. అట్టడుగు స్థానంలో చాలా కాలం అలా ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత వరసపెట్టి ఆరు మ్యాచ్ లు గెలిచి టాప్ 4 లో చోటు సంపాదించుకుంది.
ఇక్కడ గెలిచి, తర్వాత క్వాలిఫైయర్ 2 గెలిచి, తర్వాత ఫైనల్ గెలిచి , ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించని ఆర్సీబీ ఈసారి కప్ గెలవాలని మనం కూడా కోరుకుందాం. కొహ్లీ కోరిక నెరవేరాలని ఆశిద్దాం.