Bengaluru: ఈ మధ్యకాలంలో విమానాలకు రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయి. టేకాఫ్ అయిన దగ్గర క్షణాల వ్యవధిలో మళ్లీ అక్కడే ల్యాండింగ్ అవుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన బెంగుళూరు ఎయిర్ పోర్టులో బయటపడింది. బెంగుళూరు నుంచి విజయవాడకు రావాల్సిన విమానంలో టెక్నికల్ గ్లిచ్ ఏర్పడింది. అందులో ఏపీ మంత్రి రాంప్రసాద్ ఉన్నారు.
బుధవారం ఉదయం బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్‌కు సిద్ధమైన అనంతరం తిరిగి బే కు చేరుకుంది ఆ విమానం. IX 2875 నెంబరు గల ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి సహా పలువురు ప్రముఖులున్నారు. బుధవారం అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. తన జిల్లా నుంచి బెంగుళూరుకి వెళ్లిన మంత్రి, అక్కడి నుంచి కేబినెట్ సమావేశానికి హాజరుకానున్నారు.
ఈ విమానంలో మంత్రి మండిపల్లి ప్రయాణం చేయాల్సివుంది. టెక్నికల్ సమస్య అని సంబంధిత ఎయిర్ లైన్స్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీనికి సంబంధించి ప్రయాణికులకు ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక అప్‌డేట్ కోసం ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో ఎదురుచూస్తున్నారు.
ALSO READ: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఏపీ-ఉత్తర తెలంగాణల్లో ఫ్లాష్‌ఫ్లడ్, అలర్ట్ చేసిన వాతావరణ కేంద్రం