E-Paper
Advertisement

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఏపీ-ఉత్తర తెలంగాణల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌, అలర్ట్ చేసిన వాతావరణ కేంద్రం

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఏపీ-ఉత్తర తెలంగాణల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌, అలర్ట్ చేసిన వాతావరణ కేంద్రం
Advertisement

Flash Floods: బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం ఉగ్రరూపం దాల్చుతోంది. ఇది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది.  బుధవారం రాత్రికి విశాఖపట్నం-గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణల్లోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలొచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్‌ ఎలర్ట్‌ జారీ చేసింది.

ఉగ్రరూపం దాల్చుతున్న బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

పశ్చిమ-మధ్య వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న తీవ్ర వాయుగుండం 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోంది. మంగళవారం రాత్రి 11.30 గంటలకు 18.0° ఉత్తర అక్షాంశం- 85.0° తూర్పు రేఖాంశం వద్ద అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. కళింగపట్నంకు తూర్పు-ఆగ్నేయంగా సుమారు 100 కి.మీ, విశాఖపట్నంకు తూర్పు-ఈశాన్యంగా 180 కి.మీ దూరంలో ఉంది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ బుధవారం రాత్రికి విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఏపీలోని ఉత్తరాంధ్ర-ఉత్తర తెలంగాణల్లో పలు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌

Advertisement

బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఏపీ-తెలంగాణల్లో ఆకస్మిక వరదలు సంభవించినున్నాయి. దీంతో  పలు జిల్లాలకు రెడ్‌ ఎలర్ట్‌ జారీ చేసింది వాతావారణ కేంద్రం. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండానికి తోడు కర్ణాటక-కోస్తాంధ్ర మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల 20 సెం.మీలపైగానే భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరికొన్ని చోట్ల 11 నుంచి 20 సెం.మీ లోపు అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.

అర్ధరాత్రి వాయుగుండం తీరం దాటే అవకాశం

తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాజిల్లాల్లోని పలుచోట్ల భారీవర్షాలు కురుస్తాయని తేల్చిచెప్పింది. మంగళవారం ఉదయం ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో 9 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ వస్తాయని అలర్ట్‌ జారీచేసింది.

ఈ జిల్లాల్లో ఆకస్మిక వరదలు,  అలర్ట్‌ చేసిన వాతావరణ కేంద్రం

Advertisement

అందులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, మన్యం జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ వస్తాయని అలర్ట్ చేసింది. దీనికితోడు గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలను అలర్ట్ చేసింది. తెలంగాణలో 4 జిల్లాలు, ఒడిశాలో 5 జిల్లాలు, ఛత్తీస్‌గఢ్‌లో 3 జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ వస్తాయని అలర్ట్ చేసింది. వాటిలో భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాకు బుధవారం సాయంత్రంలోపు ఆకస్మిక వరదలకు అవకాశం వుంది. అతిభారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించారు అధికారులు.

ALSO READ: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రంగంలోకి సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

వర్షాల నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే విభాగం అప్రమత్తమైంది. విశాఖ-కొత్తవలస-కిరండోల్ మార్గంలో నడిచే పలు రైళ్ల సర్వీసులను బుధవారం, గురువారం నిలిపివేయాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు తాజా సమాచారం తెలుసుకున్న తర్వాత ప్రయాణాలు చేసుకోవాలని సూచన చేశారు.

 

Related News

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు!

కానిస్టేబుళ్లకు బంపర్ ఆఫర్.. స్టైపెండ్ రూ.12,500కు పెంపు: హోంమంత్రి అనిత

టీచర్లపై దాడి చేసిన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టం.. వైసీపీకి మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్

సినీ, టీవీ రంగానికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..?

విజయవాడలో విషాదం.. వేడి సాంబార్ గిన్నెలో పడి మహిళ దుర్మరణం!

కూతురు పెళ్లి కోసం తెర వెనుక రాజకీయాలా? ఆ ఖర్మ నాకు లేదన్న వైఎస్ షర్మిల, వెనుక ఏం జరిగింది?

డీఎస్సీ స్కామ్‌లో బాబు, లోకేష్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు: వైఎస్ జగన్

Big Stories

Advertisement
×