Mohsin Naqvi stolen Gold Medals: టీమిండియా మహిళల జట్టు ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్లో అదరగొట్టింది. నిన్న ఫైనల్స్ లో మహిళల శ్రీలంక జట్టును చిత్తు చేసి, గోల్డ్ మెడల్ అందుకుంది. ఈ సందర్భంగా ప్లేయర్లకు ఇచ్చిన మెడల్స్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ దొంగలించాడని సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఇప్పటికే రెండు ఆసియా ట్రోఫీలను దొంగలించిన మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi stolen Gold Medals), ఇప్పుడు మహిళల టీమ్ ఇండియాకు సంబంధించిన మెడల్స్ కూడా లేపేసాడని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై బీసీసీఐకి అటు ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నిర్వాహకులకు టీమిండియా క్రికెటర్లు ఫిర్యాదు చేసినట్లు నేషనల్ మీడియాలో అటు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ఇది చూసిన క్రీడా అభిమానులు…మొహ్సిన్ నఖ్వీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. నీ దొంగ బుద్ధి ఇంకా పోనించుకోలేదా? అంటూ నిలదీస్తున్నారు. వెంటనే మొహ్సిన్ నఖ్వీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో ( Asian games 2026)భాగంగా టీమిండియా వర్సెస్ శ్రీలంక మహిళల జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో టీమిండియా 147 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లు ఆడింది.. ఈ సందర్భంగా మూడు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా 216 పరుగులు చేసింది. ఈ టార్గెట్ చేదించే క్రమంలో శ్రీలంక ఉమెన్స్ టీం, 69 పరుగులకు కుప్ప కూలింది. దీంతో 147 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా కు పసిడి పతకం దక్కింది. అటు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు, కాంస్యం మాత్రమే లభించింది.
ఆసియా కప్ 2025 పురుషుల టోర్నమెంటుకు సంబంధించిన ట్రోఫీతో పాటు… మహిళల టైటిల్ కూడా మొహ్సిన్ నఖ్వీ దొంగిలించాడని మొన్నటి వరకు వార్తలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా అందుకోవడం ఇష్టం లేక… ట్రోఫీని పురుషుల టీమిండియాతో పాటు మహిళలు కూడా వదులుకున్నారు. దీంతో ఆ రెండు ట్రోఫీలను తన వెంట తీసుకువెళ్లాడు మొహ్సిన్ నఖ్వీ. దీంతో దొంగిలించాడని ప్రచారం జోరుగా సాగింది. అయితే లేటెస్ట్ గా ఏషియన్ గేమ్స్ 2026 సందర్భంగా టీమిండియా మహిళల జట్టు ప్లేయర్లకు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయితే వీటిని కూడా మొహ్సిన్ నఖ్వీ దొంగలించాడని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ మేరకు మొహ్సిన్ నఖ్వీ పెద్ద దొంగ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.