E-Paper
Advertisement

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం.. ల్యాండ్‌ అయిన తొలి విమానం!

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం.. ల్యాండ్‌ అయిన తొలి విమానం!
Advertisement

Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. ఎయిర్‌పోర్టు నుంచి తొలిసారిగా వాణిజ్య విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

సోమవారం ఉదయం 7:00 గంటలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం భోగాపురం రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్‌ అయింది. విమానాశ్రయ చరిత్రలో ఇది మొదటి ల్యాండింగ్ కావడంతో అక్కడి వాతావరణం పండగను తలపించింది. ల్యాండైన వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ప్రయాణికులకు ఘనంగా స్వాగతం పలికారు. తెలుగువారి విశిష్ట సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఏటికొప్పాక బొమ్మలను ప్రయాణికులకు జ్ఞాపికలుగా అందించి తమ సంతోషాన్ని పంచుకున్నారు.

Advertisement

ఈ తొలి విమానం ఉదయం 7:30 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లింది. అదే సమయంలో, ఉదయం 7:30 గంటలకు బెంగళూరు నుంచి వచ్చిన మరో ఇండిగో విమానం భోగాపురంలో ల్యాండ్‌ అయి, ఉదయం 8:00 గంటలకు తిరిగి బెంగళూరుకు పయనమైంది. ఈ ల్యాండింగ్‌లతో ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ స్వప్నం సాకారమై, ప్రాంతీయ విమాన అనుసంధానత మరింత బలపడింది.

Advertisement

Also Read: చేప పిల్లల పంపిణీకి బకాయిల బ్రేక్.. సస్పెన్స్‌లో మత్స్యకారుల భవిష్యత్తు!

Tags

Related News

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

Big Stories

Advertisement
×