YS Sharmila: చెన్నైలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు.. ప్రజాస్వామ్యానికి పునాదని వైఎస్ షర్మిలా అన్నారు. ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర ప్రశ్నలు వేసారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ఆరోపణలు చేశారు. ఇతర ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండానే 14 ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు.
Also read: 10నిమిషాల ఛార్జింగ్‌తో..200 నిమిషాల ప్లేటైమ్ ఇయర్ బడ్స్
ఎన్నికల సంఘంలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడంపై ఆందోళన చేస్తమని అన్నారు. మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రభావంలోకి రాజ్యాంగ సంస్థలు వెళ్తున్నాయని వైఏస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖల తరహాలోనే ఈసీపై కూడా అనుమానాలు ఉన్నాయని అన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని షర్మిల తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజల ఓటు హక్కు కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. మన ఓటే మన గొంతుక.. మన ప్రజాస్వామ్యమే మన బలమని వ్యాఖ్యానించారు.
Also read: సింగీతం శ్రీనివాసరావు చివరి కోరిక అదేనా?నెరవేరకుండానే కన్నుమూశారా?