E-Paper
Advertisement

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!
Advertisement

Guntur: ప్రతీ కుటుంబానికి భరోసా కూటమి ప్రభుత్వం ఇచ్చిందని, ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టించి తీరుతామన్నారు సీఎం చంద్రబాబు. 2029 నాటికి వందశాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ప్రతీ పేదవాడికి ఇంటి కల సాకారం చేయాలని సంకల్పించామని, తాను అడిగిన వెంటనే 3 లక్షల ఇళ్లకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు సీఎం చంద్రబాబు. 3 లక్షలు చాలవని, 9 లక్షలు ఇళ్లు కావాలని కోరాన్నారు.

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్

ఇప్పటికే ఏపీకి 75 వేల ఇళ్లు మంజూరు అయ్యాయని చెప్పారు. నా సంకల్ప బలానికి తోడు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చేయి కలపారన్నారు. బుర్రిపాలెం అంటే సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకు వచ్చేవారని, ఇప్పుడు ఈ ప్రాంతంలో మరొక హీరో వచ్చారన్నారు. ఆయన సినీ హీరో అయితే, పెమ్మసాని పొలిటికల్ హీరోగా వర్ణించారు. అభివృద్ధి చేయడంలో పెమ్మసాని ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు.

ఈ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ శంకుస్థాపన

Advertisement

తన కేబినెట్‌లో మొదట గుర్తుకు వచ్చేది నాదెండ్ల మనోహర్ అని, ధరలు పెరిగిన వెంటనే కంట్రోల్ చేస్తాన్నామంటూ నాకు ఒక చీటి పంపేవారని గుర్తు చేశారు. ధరలు పెరగకుండా మంత్రి నాదెండ్ల సమర్థంగా పని చేస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం కోసం త్యాగం చేసిన సీనియర్ నాయకుడు రాజేంద్రప్రసాద్ అని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నిత్యం ప్రజలతో మమేకం అవుతున్నారని వివరించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని భ్రష్టు పట్టిందని, ఇప్పుడు 3 డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.

జగన్ ఇళ్లపై విసుర్లు, కొండల్లో ఎందుకని ప్రశ్న

ఒకప్పుడు ఇళ్ల నిర్మాణం రెండేళ్లు సమయం పట్టేదని, ఇప్పుడు 3 నెలల్లోనే నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు.  పేదల ఇల్లు అంటే గోడలు కాదని, ఒక భరోసా అని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ఎక్కడో కొండలు, గుట్టల్లో ఇళ్లు మంజూరు చేసిందన్నారు. నివాసం యోగ్యం కాని ఇళ్లు మంజూరు చేస్తే ఎవరికైనా లాభం ఉంటుందా? అంటూ ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధితోపాటు ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. కరవు సీమను సిరుల సీమగా తయారు చేస్తామని హామీ ఇచ్చామని, రిలయన్స్ వంటి పెద్ద సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని అన్నారు.

Advertisement

అంతకుముందు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. విధ్వంసం ఆలోచనలతో జగన్ పేద ప్రజల కలను పూర్తిగా నాశనం చేశారని, పేద ప్రజల సొంతింటి కలను ఇవాళ సీఎం చంద్రబాబు తప్పకుండా నేరవేర్చుతారని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో 3 లక్షల ఇళ్ల నిర్మాణ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి, ఆంధ్రప్రదేశ్ వంటి పుణ్యభూమికి కోటి అంటూ తెలుగులో స్పీచ్ ప్రారంభించారు. తాను మధ్యప్రదేశ్ కేకాదు.. ఏపీ కూడా మామయ్య వంటి వాణ్నేనన్నారు. తెనాలి చరిత్ర చిన్నప్పటి నుంచి వింటున్నారని, ప్రతిభకు మారుపేరు ఈ ప్రాంతమన్నారు. తెనాలి రామకృష్ణ కీర్తి నేటికీ చెప్పుకుంటూనే ఉన్నామన్నారు.

ALSO READ: కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

సర్వాంధ్రపై సీఎం చంద్రబాబు విజయన్ గొప్పదని, పని అనుకున్నారంటే పూర్తి అయ్యేవరకు ఆగరన్నారు. టెక్నాలజీపై ముందు ఆలోచించి కొత్త అధ్యాయాన్ని ఏపీలో అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు విజన్, దేశానికి ఒక దిక్సూచిగా మారనుందన్నారు. అభివృద్ధి విషయంలో ఏపీ, దేశంలోనే తొలి స్థానంలో ఉంటుందన్నారు. ఏపీ ప్రజల మమకారం ఎప్పటికీ నా మదిలో నిలిచే ఉంటుందని, సీఎం చంద్రబాబు సంకల్ప బలం చాలా గొప్పదన్నారు. పేద ప్రజల సొంత ఇంటి కల సాకారానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Related News

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా.. ఓ ప్రయాణికుడ్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, అనంతపూర్ జిల్లాలో ఘటన

పీపీపీ పేరుతో రాష్ట్రం అమ్మకానికి? చంద్రబాబు, లోకేష్‌లపై పేర్ని నాని సంచలన ఆరోపణలు

కాకినాడ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్.. అసలు సూత్రధారి అతడే!

ప్రియురాలి పీక కోసి.. బిల్డింగ్‌పై నుంచి దూకేసిన ప్రియుడు

Big Stories

Advertisement
×