E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం రోహిణి ప్లాన్.. అరుణ్, సుమతి లవ్ ట్రాక్.. ప్రభావతి దెబ్బకు షాక్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం రోహిణి ప్లాన్.. అరుణ్, సుమతి లవ్ ట్రాక్.. ప్రభావతి దెబ్బకు షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 17th : శృతి ఇంటికి రాగానే తన ఫ్రెండుకి మేకప్ వేయాలి.. నువ్వు వెళ్తావా వెళ్ళవా అని రోహిణి దగ్గరికి వచ్చి అడుగుతుంది. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళనివ్వడం లేదు కదా నేను ఎలా వెళ్లి మేకప్ వేయాలి అని రోహిణి అడుగుతుంది. అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి కాలు కూడా బయటికి పెట్టొద్దు అని చెప్పారు కదా ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఏం బాగుంటుంది అని రోహిణి అంటుంది.. అయినా ఇప్పుడు ఇది బయటకు వెళ్లి ఎంతమంది కొంపలు కూల్చాలి అని ప్రభావతి కఠినంగా మాట్లాడుతుంది.. కానీ సత్యం మాత్రం కోడలు బయటికి వెళ్లే స్వతంత్రం తనకు ఉంది నువ్వు ఏమి మాట్లాడద్దు ఇందులో అని అంటాడు రోహిణి మాత్రం తన తల్లిని కలుసుకోబోతున్న నేను చాలా సంతోషంగా ఉంటుంది.

మనోజ్ కోసం రోహిణి ప్లాన్..

మనోజ్ రోహిణి చేసిన పని వల్ల బాధపడిపోతూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక స్వామీజీ మీకోసం పూజ చేశాను. అందుకే ఇవి తీసుకొని వచ్చాను అని చెప్తాడు. నేనేమీ పూజ చేయమని చెప్పలేదు కదా మరి ఎవరు చేయమని చెప్పారు అని అడుగుతాడు.. అయితే మీ మీద ప్రయోగాలు ఉంటాయని ఒక ఆవిడ పూజ చేయించి అక్కడ వచ్చిన మీకు తెచ్చి ఇవ్వమని చెప్పారు. నాకోసం పూజ చేయించాలి అని అనగానే.. ఎవరు చేయించారు నేను చేయించలేదు కదా ఇప్పుడు డబ్బులు అడుగుతారు ఏంటి అని మనోజ్ అడుగుతాడు.. అయితే మీ ఆవిడ రోహిణి మీ కోసం పూజ చేయించి మీ బాధ అంత పోగొట్టాలని నాకు చెప్పింది. ఆవిడ చెప్పినట్లుగానే పూజ చేయించాను ఇదిగోండి విభూది అని అంటాడు.

మనోజ్ మారిపోతాడా..?

Advertisement

మనోజ్ ఎందుకు రోహిణి నాకోసం ఇలాంటివి చేస్తుంది మళ్ళీ ఇది ఒక ప్లాన్ అని ఆలోచిస్తూ ఉంటుంది. రోహిణి ఎందుకు నా కోసం ఇలా చేసింది అని మనోజ్ ఆలోచిస్తూ ఉంటాడు.. నాకోసం రోహిణి ఇలా చేస్తుంది అంటే మళ్ళీ నాతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తుందా..? లేకపోతే ఇంకేదైనా పూజ అని నాకు దగ్గర అవ్వాలని చేసి మళ్లీ మోసం చేస్తుందని మన ఆలోచిస్తూ ఉంటాడు.. అప్పుడే షాప్ లోని వల్ల వచ్చి ఎక్కడికి వెళ్లారు. ఎందుకు ఇంత లేటు వచ్చారు కస్టమర్లు వస్తే ఏం చేస్తారు అని అడుగుతాడు.. కంపెనీ ప్రమోషన్స్ కోసం మేం బయటికి వెళ్ళాం సార్ అని చెప్పగానే ఎవరు చెప్పారు ప్రమోషన్స్ చేయమని మనోజ్ అడుగుతాడు. అయితే రోహిణి మేడం ఇలాంటివన్నీ ముందే ఆలోచించి చేస్తున్నారు ప్రమోషన్స్ కోసం పాంప్లెట్లు కూడా కొట్టించారు అని చెప్పగానే మనోజ్ రోహిణి ఇలాంటి పనులు కూడా చేస్తుందని అనుకుంటాడు.. అటు రోహిణి ఖచ్చితంగా మనోజ్ మళ్ళీ తనకు దగ్గర అవుతాడు అని ఆశపడుతూ ఉంటుంది.

మనోజ్ మాటతో రోహిణి షాక్..

మనోజ్ రాత్రి ఇంటికి రాగానే రోహిణి ప్రేమగా దగ్గరికి వస్తుంది . తనపై మనోజ్ కి ప్రేమ పుడుతుంది అని ఆశపడుతుంది కానీ రోహిణి అలా ముట్టుకోగానే మనోజ్ చెయ్యి పక్కన పడేసి చాప దిండు తీసుకుని పైకి వెళ్లాలని అనుకుంటాడు. అక్కడికి వచ్చిన మనోజ్ పైకి వెళ్తూ ఉండగా ప్రభావతి ఎక్కడికి రా వెళ్తున్నావు అని అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్లట్లేదు పైన పడుకుందామని వెళ్తున్నాను అని చెప్పగానే అదేంటి రూమ్ లో పడుకోకుండా పైన ఎందుకు వెళ్తున్నావు అని మనోజ్ ని అడుగుతుంది ప్రభావతి. రూమ్లో తను ఉందమ్మా అందుకే నేను పైకి వెళ్తున్నాను అని మనోజ్ అంటాడు.. ఇంటికి ఓనర్ లాంటోడివి. నువ్వు పడుకోవాలి అది ఏదో చెత్త కుప్పలు పక్కన పడుకునింది కదా.. దానికి అలవాటు అది కింద పడుకుంటుంది నువ్వు వెళ్లి మంచం మీద పడుకొని ప్రభావతి పంపిస్తుంది.. మనోజ్ నీ రెచ్చగొడుతున్నప్పుడు ప్రభావతి దగ్గరికి బాలు వస్తాడు. బాలు మొగుడు పెళ్ళాలని విడగొడితే నాశనం అయిపోతారు అంటూ శాపాలు పెడుతూ వెళ్ళిపోతాడు అది చూసిన ప్రభావతి షాక్ అవుతుంది. మనోజ్ కిందకి వెళ్లి రోహిణి నీ కింద పడుకోమని చెప్తాడు అది విన్నరోహిని కన్నీళ్లు పెట్టుకుంటుంది..

అరుణ్ కు సుమతి గ్రీన్ సిగ్నల్..

Advertisement

అరుణ్ బర్త్డే కాబట్టి గుడికి వస్తానని చెప్పాడు ఇంకా రాలేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది సుమతి.. గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత తనతో మాట్లాడాలి అని అనుకుంటుంది బయటికి రాగానే అరుణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అరుణ్ ఆ దేవుడు దర్శనం కంటే నీ దర్శనమే నాకు ఇంపార్టెంట్ అని అనగానే సుమతి నేను మీరంటే ఇష్టం లేదు అని చెప్పట్లేదు కానీ నాకు కొంచెం టైం కావాలి అని అంటుంది. మీరంటే ఇష్టమే అని అనడంతో సుమతి మాటతో అరుణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.. మా ఇంట్లో ఒప్పించడానికి చాలా టైం పడుతుంది అని అనగానే నువ్వు ఎప్పుడైనా ఒప్పించు నువ్వు ఓకే అన్నావ్ సరే అని అరుణ్ అనుకుంటాడు ఇద్దరు కలిసి భోజనానికి వెళ్లాలని అనుకునే లోపల ఏం బాలు అక్కడికి వస్తాడు..

బాలుకు సుమతి దొరుకుతుందా..?

బాలు సుమతి అరుణ్ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ కస్టమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.. సుమతి బాలు వచ్చాడన్న సంగతిని గమనించకుండా ఉంటుంది. అటు బాలు కూడా అరుంధతి మాట్లాడుతుంది అని చూడకుండా కస్టమర్ తో మాట్లాడుతూ ఉంటాడు.. బాలు కస్టమర్ ను ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉండగా సుమతి అలాగే అరుణ్ కూడా అదే దారి నుంచి వెళ్ళిపోతారు.. మరి సుమతి అరుణ్ణి బాలు చూస్తాడా లేదా అన్నది ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. బాలు చేసిన పనికి మీనా కూడా అటు సీరియస్ గానే ఉంటుంది..

శృతి దెబ్బకు రోహిణి షాక్..

శృతి ఏదో మాడువాసన వస్తుంది అని వంటగదిలోకి వస్తుంది. రోహిణి నీ వంట నువ్వే చేసుకోవాలని అత్తయ్య చెప్పింది అందుకే నేను వంట చేసుకుంటున్నాను అని మీనా తో చెబుతూ ఉంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన రోహిణి ఏంది అని అడుగుతుంది. అయితే సుతి మాట్లాడుతూ ఉండగా రోహిణి ఎందుకు నన్ను ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నావు అని అంటుంది. నువ్వు నీ పని చేసుకో నేను నా పని చేసుకుంటాను అని ఎంత చెప్తున్నా సరే శృతి మాత్రం వినకుండా రోహిణి పై కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. రోహిణి ఏదో దాస్తుంది అని శృతికి అనుమానం ఉంటుంది. ఇక మీనా కి కూడా అవును ఏదో అనుమానంగానే ఉంది అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: సాగర్ మాటతో నర్మద ఫిదా.. ధీరజ్ ఎంట్రీతో ప్రేమ షాక్.. కన్నీళ్లు పెట్టించిన వేదవతి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×