BigTV English
Advertisement

OTT Movie : కామాంధులకు బుద్ధి చెప్పే ముసలావిడ… ఆమె ఏం చేసిందో తెలిస్తే చచ్చినా అలాంటి పని చేయరు

OTT Movie : కామాంధులకు బుద్ధి చెప్పే ముసలావిడ… ఆమె ఏం చేసిందో తెలిస్తే చచ్చినా అలాంటి పని చేయరు

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు కొద్దిరోజుల గ్యాప్ తోనే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో బాక్సాఫీస్ ని షేక్ చేస్తాయి. మరికొన్ని ఓటిటి ప్లాట్ ఫామ్ ని అదరగొడతాయి. థియేటర్లలో అంతగా విజయం సాధించకపోయినా, ఓటిటి ప్లాట్ ఫామ్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఒక మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


డిస్నీ + హాట్ స్టార్ (Disney +hotstar)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ్ మూవీ పేరు ‘సెంబి‘ (Sembi). ఈ మూవీలో అడవిలో నివసించే అక్షరాస్యత లేని, నిరుపేద ఇంటికి చెందిన ఒక చిన్న పాపని సిటీ కి చెందిన ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యం చేస్తారు. ఈ అమ్మాయి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ డిస్నీ + హాట్ స్టార్ (Disney +hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

వీరతాయి 70 సంవత్సరాల పైబడిన ఒక ముసలామె. ఆమె మనవరాలు సెంబికి తల్లిదండ్రులు చనిపోవడంతో, వీరతాయి ఆమెని చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు తేనెను పక్క ఊరిలో అమ్ముకొని రమ్మని చెప్పి పంపిస్తుంది. అడవి మృగాలు ఉంటాయేమో అనుకుంటూ భయపడుతూ వెళ్తుంది. అయితే అడవి మృగాలకు బదులు, మానవ మృగాలు సెంబిపై దాడి చేస్తారు. దారి మధ్యలో సిటీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ అమ్మాయిపై అఘాయిత్యం చేస్తారు. వీరతాయి ఆమెను హాస్పిటల్ కి తీసుకుని వెళుతుంది. మొదట అడగ జంతువులు ఏమైనా చేశాఏమో అనుకుంటుంది. ఆ తర్వాత డాక్టర్లు ఆమెపై అఘాయిత్యం జరిగిందని చెప్తారు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది బీరతాయి. ఇన్స్పెక్టర్ సి సి ఫుటేజ్ చెక్ చేసినప్పుడు అందులో ప్రముఖ రాజకీయ వేత్త కుమారుడు కూడా ఉంటాడు. అతనితో డీల్ మాట్లాడుకుని కేసు క్లోజ్ చేయడానికి డబ్బు తీసుకుంటాడు. అయితే వీరతాయి కేసు వాపస్ తీసుకోవడానికి ఒప్పుకోదు. పోలీస్ ఆఫీసర్ వీరతాయిని చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎదురు దాడి చేసి తప్పించుకుంటుంది.

మనవరాలితో కలిసి ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటుంది వీరతాయి. ఆమె కోసం పోలీసులు అందరూ వెతుకుతుంటారు. చివరికి ఎవరైనా సహాయం చేస్తే బాగుండని దేవుడిని వేడుకుంటుంది వీరతాయి. ఈ పరిస్థితుల్లో బస్సులోనే ప్రయాణం చేతున్న విక్రమ్ అనే వ్యక్తి ఈమెకు అండగా నిలుస్తాడు.సోషల్ మీడియా ద్వారా తన మనవరాలికి జరిగిన అన్యాయం బయట ప్రపంచంలోకి వైరల్ అవుతుంది. చివరికి ఆ ముగ్గురు వ్యక్తులకి శిక్ష పడుతుందా? బీరతాయి మనవరాలు కోసం పోరాడుతుందా? చివరికి పోలీసులు వీరతాయిని ఎం చేస్తారు? సెంబి మళ్లీ మామూలు మనిషి అవుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ + హాట్ స్టార్ (Disney +hotstar) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సెంబి’ (Sembi) మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×