BigTV English

Uttam Kumar Reddy : సాగునీటి ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష.. సీతారామ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న మంత్రి ఉత్తమ్..

Uttam Kumar Reddy : బీఆర్ఎస్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగమైందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో మంత్రులు భట్టి విక్రమార్క,పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు సమీక్ష నిర్వహించారు.

Uttam Kumar Reddy : సాగునీటి ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష.. సీతారామ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న మంత్రి ఉత్తమ్..
Telangana politics
Uttam Kumar Reddy

Uttam Kumar Reddy Comments on BRS(Telangana politics):

బీఆర్ఎస్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగమైందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు సమీక్ష నిర్వహించారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్కో ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ, ఇతర సాగునీటి ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి జరిగినట్లుగానే ఇందులోనూ భారీ కుంభకోణం జరిగినట్లు భావిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రాజెక్టుల పేరిట భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు.

గతంలో ఈ ప్రాజెక్టు ఇందిరాసాగర్‌, రాజీవ్‌ దుమ్ముగూడ అని రెండు వేర్వేరుగా ఉండేవి. ఈ రెండింటినీ ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారో తమకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు . గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌ సైతం సీతారామ ప్రాజెక్టుపై అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని విమర్శించారు.


2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనప్పుడు మరో రూ.1400 కోట్ల నుంచి రూ.1500 కోట్లు ఖర్చు చేసి ఉంటే దుమ్ముగూడ, ఇందిరాసాగర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లు ఏడాదిలో పూర్తయ్యేవని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే 3,32,000 ఎకరాలకు నీరు అందేదని తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం మరో రూ.7,500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కానీ ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని కేసీఆర్‌పై విమర్శలు చేశారు. సీతారామ ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచి రూ.18వేల కోట్ల రూపాయలకు తీసుకొచ్చారని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×