E-Paper
Advertisement

Penamaluru Assembly Constituency Survey: పెనమలూరులో ఎవరికి ఎర్త్..? ఎవరికి బెర్త్..?

Penamaluru Assembly Constituency Survey: పెనమలూరులో ఎవరికి ఎర్త్..? ఎవరికి బెర్త్..?
Advertisement
Andhra politics news

Penamaluru Assembly Constituency Survey: ఏపీలో పెనమలూరు రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా నడుస్తున్నాయి. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఉయ్యూరు నియోజకవర్గం నుంచి వేరుపడి పెనమలూరు ఏర్పాటైంది. ఈ సెగ్మెంట్ ఏర్పడినప్పటి నుంచి ఏ పార్టీ కూడా రెండుసార్లు గెలవలేకపోయింది. 2009లో కాంగ్రెస్ గెలిస్తే, 2014లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా పార్థసారథి గెలిచారు. మరి ఈసారి పెనమలూరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.

2019 RESULTS

Advertisement

పార్థసారథి వైసీపీ గెలుపు VS బోడె ప్రసాద్

2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెనమలూరులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్థసారథికి 47 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ కు 42 శాతం ఓట్లు, ఇతరులకు 11 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా జగన్, వైసీపీ వేవ్ పెనమలూరులో కూడా గట్టిగా పని చేయడంతో అప్పట్లో పార్థసారధి గట్టెక్కారు. మరోవైపు బోడె ప్రసాద్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. మరి ఈసారి ఎన్నికల్లో పెనమలూరు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

Advertisement

జోగి రమేశ్ (YCP)ప్లస్ పాయింట్స్

ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు
ప్రజల్లో పాజిటివ్ మైండ్ సెట్
పెనమలూరులో యాక్టివ్ గా ప్రచారాలు

జోగి రమేశ్ మైనస్ పాయింట్స్

పెడన నుంచి పెనమలూరు మార్పు సమస్య
పెనమలూరు వైసీపీ నేతల వ్యతిరేకత
జోగి రమేశ్ నాన్ లోకల్ అన్న వాదన
కీలక నేత పడమట సురేశ్ బాబు సపోర్ట్ పై డౌట్లు
క్యాడర్ సపోర్ట్ ఎంత వరకు ఉంటుందన్న అనుమానం

బోడె ప్రసాద్(TDP) ప్లస్ పాయింట్స్

సీనియర్ టీడీపీ నేతగా జనంలో ఇమేజ్
గత ఎన్నికల్లో ఓడినా సెగ్మెంట్ లో యాక్టివ్
గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి
గ్రౌండ్ లో ప్రస్తుతం యాక్టివ్ గా కార్యకలాపాలు
యూత్ లో ప్రత్యేక గుర్తింపు
టీడీపీ క్యాడర్ సపోర్ట్ ఉండడం

బోడె ప్రసాద్ మైనస్ పాయింట్స్

జోగి రమేశ్ ను ఏమేరకు ఎదుర్కొంటారన్న డౌట్లు

ఇక వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

జోగి రమేశ్ VS బోడె ప్రసాద్

ఇప్పటికిప్పుడు పెనమలూరులో ఎన్నికలు జరిగితే టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ కు 49 శాతం ఓట్లతో విజయం సాధించే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అలాగే వైసీపీ నుంచి బరిలో దిగే జోగి రమేశ్ కు 43 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇతరులకు 8 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈసారి పెనమలూరులో టీడీపీ ఓట్ షేర్ పెరగడానికి కారణం జనసేనతో పొత్తు ఉండడం, ఈ సెగ్మెంట్ లో కాపు కమ్యూనిటీ జనాభా 14 శాతం ఉంది. వీరి ఓట్లు ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి. అలాగే కమ్మ వర్గం జనాభా 25 శాతంగా ఉంది. అలాగే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత కూడా టీడీపీ ఓట్ షేర్ పెరగడానికి కారణమని సర్వేలో జనం అభిప్రాయంగా తేలింది.

మరోవైపు వైసీపీ ఓట్ షేర్ కు లబ్దిదారుల ఓట్లే కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం అభ్యర్థిగా ఉన్న జోగి రమేశ్ నాన్ లోకల్ అన్న అభిప్రాయం జనంలో ఉంది. అలాగే పెనమలూరులో వైసీపీ ఫుల్ క్యాడర్ సపోర్ట్ ఇచ్చే పరిస్థితులు లేవన్నది గ్రౌండ్ రియాల్టీగా ఉంది. పార్థసారథి టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీ నుంచి పడమట సురేష్ బాబు టిక్కెట్ ఆశించారు. కానీ జోగి రమేష్ ను ఇంఛార్జ్ గా నియమించడంతో సురేష్ బాబు వర్గమంతా ప్రస్తుతం సైలెంట్ అయింది. వీరిని ప్రసన్నం చేసుకోవడం, పెనమలూరులో నెగెటివిటీని ఎన్నికల నాటికి తగ్గించుకోవడంపై ఓట్ షేర్ ఆధారపడి ఉండనుంది.

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×