Golden Facial: ఫేషియల్ చేయించుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇందుకోసం అమ్మాయిలు పార్లర్‌కి వెళ్లడానికే ఇష్టపడతారు. మెరిసే, ప్రకాశవంతమైన , మచ్చలేని చర్మాన్ని పొందడానికి, మహిళలు ఫేషియల్ చేయించుకోవడానికి ఇష్టపడతారు. ఇది చర్మంలో రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. అంతే కాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. కానీ, కొంతమంది సమయం లేదా డబ్బు లేకపోవడం వల్ల ఫేషియల్ చేయించుకోలేకపోతారు. కానీ మీరు ఇంట్లోనే సులభంగా ఎలాంటి ఖర్చు చేయకుండా ఫేషియల్ చేసుకోవచ్చు. ఇంట్లో ఫేషియల్ చేయించుకోవడం వల్ల డబ్బు ఆదా కావడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శుభ్రపరచడం:
ముందుగా పచ్చి పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పాలు ఒక సహజమైన క్లెన్సర్. ఇది మురికి, అదనపు నూనెను తొలగిస్తుంది. అంతే కాకుండా మీరు దీన్ని ప్రతి రోజూ మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. చర్మ సౌందర్యానికి మేలు చేయడంలో పాల కంటే మించినది ఏదీ లేదు.ఇది చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.
ఇంట్లో తయారుచేసిన స్క్రబ్:
1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ చక్కెర పొడి , 1/2 టీస్పూన్ నిమ్మరసం కలపి పేస్ట్ లాగా తయారు చేయండి. దీనితో మీ ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేయండి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి, ముఖ రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది.
ఆవిరి పట్టడం:
ఒక గిన్నె లేదా స్టీమర్‌లో నీటిని వేడి చేసి ఆవిరి తీసుకోండి. కనీసం 3-4 నిమిషాలు ఆవిరి పట్టిన తర్వాత, 2 నిమిషాలు వేచి ఉండండి. ఇది రంధ్రాలను శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చర్మంపై ఉన్న మురికిని తొలగిస్తుంది.
ఫేస్ మాస్క్:
1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ శనగపిండి , చిటికెడు పసుపు కలిపి మెత్తగా తయారు చేసిన ఫేస్ట్‌ను ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు ఉంచి తరువాత మంచి నీటితో వాష్ చేయండి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో వాడే తేనె చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. పసుపులో యాంటీఆక్సిడెంట్, క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి.
Also Read: రైస్ వాటర్‌తో ఫేస్ సీరం.. ఎలా తయారు చేసుకోవాలంటే ?
మాయిశ్చరైజింగ్ :
రోజ్ వాటర్ , కలబంద జెల్ ని మీ అరచేతులకు రుద్దండి. తరువాత దానిని మీ ముఖం మీద అప్లై చేయండి. దీనివల్ల చర్మం పొడిబారదు. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మురికి తొలగిపోతుంది. మీకు కావాలంటే, మీరు పొడి చర్మాన్ని నివారించడానికి మాయిశ్చరైజర్ లేదా డే/నైట్ క్రీమ్ కూడా అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
ఎలాంటి రసాయనాలు వాడకుండా ఇంట్లోనే ఇలా గోల్డెన్ ఫేషియల్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతే కాకుండా ఖర్చు కూడా పెద్దగా ఉండదు. తరచుగా ఇలా గోల్డెన్ ఫేషియల్ చేసుకోవడం వల్ల గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.