Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కేసుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఈ సంధర్భంగా పురంధేశ్వరి సంచలన కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ కావాలని నేరం చేసింది కాదుగా అంటూ పలు కీలక కామెంట్స్ చేశారు ఆమె. ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటనలో పురంధేశ్వరి ఈ కామెంట్స్ చేశారు.
హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల సంధర్బంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. అలాగే ఓ చిన్నారి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం, అల్లు అర్జున్ ను అరెస్ట్ కావడం, బెయిల్ పై బయటకు వచ్చిన విషయం కూడా తెలిసిందే.
అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ.. అందరూ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ చనిపోయిన మహిళ కుటుంబం గురించి, చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు శ్రీ తేజ్ గురించి సినిమా పెద్దలు పట్టించుకోక పోవడం తగదన్నారు. కేవలం అల్లు అర్జున్ తప్పిదం వల్లే తొక్కిసలాట జరిగిందని, ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే ఎలా అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
ఇలా సీఎం అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్స్ పై తాజాగా అల్లు అర్జున్ కూడా స్పందించి మీడియా సమావేశం నిర్వహించారు. తన తప్పిదం లేదని, దురదృష్టవశాత్తు జరిగిన ఘటనగా వర్ణించిన బన్నీ, శ్రీ తేజ్ కుటుంబానికి అండగా నిలుస్తానంటూ మరోమారు పునరుద్ఘాటించారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇదే విషయంపై స్పందించారు.
Also Read: KTR Tension In KCR: కేసీఆర్‌కు నిద్రలేకుండా చేస్తున్న కేటీఆర్
ఒంగోలులో పురంధేశ్వరి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ సినీ హీరోగా థియేటర్ కి వెళ్ళారని, ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదన్నారు. కేసులో మిగిలిన వారిని అరెస్టు చేయకుండా ఏ11 గా ఉన్న అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం కరెక్ట్ కాదంటూ స్పందించారు. ఆ ఘటన జరగడం దురదృష్టకరమన్న ఆమె, బాధితులకు అండగా అల్లు అర్జున్ నిలుస్తానని హామీ ఇస్తున్నాడు కదా అంటూ మాట్లాడారు. అయితే తెలంగాణ ప్రభుత్వం బాధితులకు అండగా నిలిచిన విషయాన్ని, అలాగే రూ. 25 లక్షలు ప్రభుత్వం తరపున అందించిన విషయంపై పురంధేశ్వరి మాట్లాడకపోవడం విశేషం.
ఇక,
జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగిందని, జేపీసీ కి బిల్లును రిఫర్ చేయడం జరిగిందన్నారు. ఇది ఒక్క పార్టీ తీసుకునే నిర్ణయం కాదని, పార్టీలతో పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు జేపీసీ నిర్మాణం చేశారని పురంధేశ్వరి అన్నారు.