BigTV English

Atchutapuram Sez: సాహితీ ఫార్మాలో భారీ బ్లాస్ట్.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

Atchutapuram Sez: సాహితీ ఫార్మాలో భారీ బ్లాస్ట్.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
sahithi pharma

Atchutapuram Sez: అనకాపల్లి జిల్లాలో సాహితీ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు రియాక్టర్లు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయాయి. ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాదం నుంచి 25 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు.


కెమికల్ ల్యాబ్ కావడంతో హానికరమైన పొగ ఇబ్బందిపెడుతోంది. మంటల తీవ్రతకు ఫైర్ సిబ్బంది సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మంటలు, పొగలు భారీగా ఎగసిపడుతుండటంతో.. లోపలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. అగ్ని మాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాకే, లోపల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని చెబుతున్నారు.

ముందుజాగ్రత్తగా, చుట్టుపక్కల ప్రాంతాల్ని పోలీసులు ఖాళీ చేయించారు. సమీపంలోనే పలు ఫార్మా పరిశ్రమలు ఉండటంతో.. మంటలు వ్యాపించి వాటికీ అంటుకుంటాయేమోననే ఆందోళన వ్యక్తం అవుతోంది. సాహితీ ఫార్మా నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×