E-Paper
Advertisement

పరిపాలన గాలికి వదిలేశారు.. అన్నీ సెటిల్‌మెంట్లే!- బొత్స సత్యనారాయణ

పరిపాలన గాలికి వదిలేశారు.. అన్నీ సెటిల్‌మెంట్లే!- బొత్స సత్యనారాయణ
Advertisement

Botsa Satyanarayana: విజయనగరం జిల్లాలో జరిగిన ప్రెస్ మీట్‌లో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గడి తప్పిందని, ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.

సచివాలయ వ్యవస్థ, నిరుద్యోగుల ఇబ్బందులు

Advertisement

దేశంలో ఎక్కడాలేని విధంగా గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిందని బొత్స గుర్తుచేశారు. ఆ శాఖ మంత్రిగా తాను ఉన్న సమయంలోనే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదివిన ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అయితే, ఇప్పుడు వారు తమ సమస్యలపై ధర్నా చౌక్ దగ్గర ఆందోళన చేస్తుంటే.. పరిష్కరించాల్సింది పోయి పోలీసులతో అరెస్టు చేయించడం దారుణమన్నారు.

రైతులకు తీరని నష్టం, ఇన్సూరెన్స్ పై నిర్లక్ష్యం

Advertisement

ఇటీవలి తుపాను వల్ల అరటి, బొప్పాయి, మొక్కజొన్న, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించి నష్టపరిహారం ఇచ్చేదని, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఈ రెండున్నర ఏళ్లలో ఏ ఒక్క రైతుకూ సరైన పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. అరటి, బొప్పాయి పంటలకు ఎకరాకు లక్ష రూపాయిలు, మొక్కజొన్నకు 50 వేల చొప్పున పెట్టుబడి అవుతుందని, వెంటనే ప్రభుత్వం తగిన నష్టపరిహారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పోలీస్ వ్యవస్థ, స్థానిక సంస్థల ఎన్నికలు

రాష్ట్రంలో ఒక్క పోలీస్ స్టేషన్లలో తప్ప ఎక్కడా పాలనాపరమైన కార్యకలాపాలు సాగడం లేదని, అక్కడ కూడా కేవలం సెటిల్‌మెంట్లు మాత్రమే జరుగుతున్నాయని విమర్శించారు. చివరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులు పోటీ చేయకుండా పోలీసులే ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. కోర్టులు ఎన్నిసార్లు తప్పుపట్టినా డీజీపీ, పోలీస్ వ్యవస్థ తీరు మారడం లేదన్నారు. అలాగే, బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే చట్ట సవరణ తీసుకురావాలని బొత్స డిమాండ్ చేశారు.

Also Read: కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లకు రేవంత్ షాక్.. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటల్లో ఏం జరగబోతోంది?

Tags

Related News

డ్రైవింగ్ లైసెన్స్‌ ఆశావహులకు శుభవార్త.. ఇంటి నుంచి ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష.. ఏపీలో కొత్త విధానం

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. రాగల 12 గంటల్లో ఏపీకి వర్షసూచన

శ్రీకాకుళంలో తీవ్ర విషాదం.. పురుగుల మందు కొట్టిన ఆకులు తిని 35 మూగజీవులు మృతి!

హోంగార్డుల విషయంలో సాయిరెడ్డి సంచలన పోస్ట్.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు బిగ్ అలర్ట్!

సాగునీటి రంగానికి పూర్వవైభవం.. రూ.160 కోట్ల బిల్లుల విడుదలపై మంత్రి నిమ్మల హర్షం

ఆందోళన చేస్తే లాఠీలతో కొడతారా? గొంతు వినిపించడం నేరమా? సీఎం చంద్రబాబు‌పై జగన్ ఆగ్రహం

ఏపీలో ఘోరాతి ఘోరం.. నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మనువడు!

Big Stories

Advertisement
×