E-Paper
Advertisement

కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లకు రేవంత్ షాక్.. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటల్లో ఏం జరగబోతోంది?

కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లకు రేవంత్ షాక్.. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటల్లో ఏం జరగబోతోంది?
Advertisement

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా ఉన్న గులాబీ కోటలను బద్దలు కొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ వేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు రాజకీయంగా అత్యంత పట్టున్న గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట నియోజకవర్గాలపై ఇప్పుడు సీఎం ఫోకస్ పెంచారు. ఈ మూడు సెగ్మెంట్లలో ఏళ్ల తరబడి నెలకొన్న బీఆర్ఎస్ ఆధిపత్యానికి గండి కొట్టడమే లక్ష్యంగా రేవంత్ తన స్ట్రాటజీని అమలు చేయనున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా అధికారంలోకి వచ్చాక తమ స్థానాలను నిలబెట్టుకోవడంపైనే దృష్టి పెడుతుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం కాస్త భిన్నమైనది. ప్రతిపక్షంలోని కీలక నాయకుల సొంత నియోజకవర్గాలనే ఓడించి బీఆర్ ఎస్ డిఫెన్స్ లో పడేయాలనేది సీఎం ఆలోచన. ఇప్పటికే రేవంత్ రెడ్డికి చెందిన ప్రత్యేక ఇంటర్నల్ టీమ్‌లు ఈ మూడు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయి. అక్కడ పరిస్థితులు, ప్రభావం, బీఆర్ ఎస్ కేడర్ కు చెక్ పెట్టేందుకు అనుసరించాల్సిన విధానాలపై స్టడీ చేస్తున్నాయి.

యాక్షన్ ప్లాన్..?

Advertisement

గత పదేళ్ల పాలనలో ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి, ఇప్పటికీ తీరని ప్రజల సమస్యలపై ప్రభుత్వం నుంచి నివేదికలు సిద్ధమయ్యాయి. ఇక నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్‌కు ఉన్న బలహీనతలను అధిగమిస్తూ, అసంతృప్తిగా ఉన్న బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్ధిపేటలో హరీష్ రావు, గజ్వేల్‌లో కేసీఆర్ లను ఓడించాలని సీఎం లక్ష్యం పెట్టుకున్నారు. దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ శక్తులుగా ఉన్న ఆయా లీడర్లను రాజకీయంగా బ్రేక్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్​యంలోనే రాబోయే రోజుల్లో సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ కేంద్రాలుగా భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సీఎం కార్యాలయం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆయా నియోజకవర్గాల లబ్ధిదారులకు నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను అందిస్తూ, ‘అభివృద్ధి ఎవరి హయాంలో మెరుగ్గా ఉంది?’ అనే చర్చను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అభివృద్ధి పేరిట కమీషన్లు వసూల్ చేసి, చేయాల్సిన డెవలప్ కంటే తక్కువే చేశారంటూ ప్రజల ముందు ఓ ప్రతిపాదనలను పంపనున్నారు. అంతేగాక గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటల్లో కాంగ్రెస్ స్థానిక నాయకులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నియోజకవర్గాల్లో సొంత బలాన్ని రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నారు.

ఇప్పటికే డైలమో..

Advertisement

గతంలో నియోజకవర్గాల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా బీఆర్ఎస్ శ్రేణులదే హవా ఉండేది. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తుండటంతో, కేడర్ స్థాయిలో ఊగిసలాట మొదలైంది. స్థానిక నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలలో చాలామంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా వ్యూహాత్మక వలసలను ప్రోత్సహిస్తున్నారు.బీఆర్ఎస్ అగ్రనేతలు తమ నియోజకవర్గాలపైనే ఫోకప్ పెట్టి, మిగతా రాష్ట్రంపై దృష్టి పెట్టకుండా నిలువరించడమే సీఎం రేవంత్ వేసిన ప్లాన్ అంటూ పార్టీలో డిస్కషన్ ఉన్నది. వాస్తవానికి సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ స్థానాల్లో బీఆర్ఎస్ బలాన్ని తుడిచిపెట్టడం అంత సులభం కాకపోయినా, నిరంతర సభలు, పర్యటనలు, పక్కా ఆపరేషన్లతో అక్కడ ఆధిపత్యానికి బ్రేక్ వేయడం ఖాయంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: తెలంగాణ టూరిజంలో సరికొత్త విప్లవం.. ఇక ఇంట్లో కూర్చునే హోమ్‌స్టే రిజిస్ట్రేషన్!

Tags

Related News

ఎంబీబీఎస్ విద్యార్థులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. లోకల్ పిటీషన్ కొట్టివేత!

420 హామీలతో మోసం.. పీఎస్ లలో పెట్టాల్సింది రేవంత్ ఫొటోనే!- కేటీఆర్

తెలంగాణ టూరిజంలో సరికొత్త విప్లవం.. ఇక ఇంట్లో కూర్చునే హోమ్‌స్టే రిజిస్ట్రేషన్!

సీబీఐ సంచలనం.. ఆపరేషన్ చక్ర తో నకిలీ సుప్రీంకోర్టు వెబ్‌సైట్ గుట్టు రట్టు!

దిశ ఘటన జరిగిన చోటే మళ్లీ దారుణం.. శంషాబాద్‌లో మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడి యత్నం!

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఆటో ఢీకొని నలుగురు మృతి!

గద్వాల జిల్లాలో విద్యార్థుల బస్సు బోల్తా.. తప్పిన పెద్ద ప్రమాదం!

Big Stories

Advertisement
×