BigTV English

Manyam: పారాణింకా ఆరకముందే.. కానరాని లోకాలకి..

Manyam: పారాణింకా ఆరకముందే.. కానరాని లోకాలకి..

Bride Died Within Hours of Marriage In Manyam DistrictBride Died Within Hours of Marriage In Manyam District: పారాణింకా ఆరకముందే.. తోరణాల కళ వాడకముందే.. పెళ్లి పందిరి తీయకముందే.. అప్పగింతలు అవ్వకముందే.. కలకల లాడే ఓ నవవధువా.. పెళ్ళి కూతురుగా ముస్తాబయ్యి.. శ్మశానానికే కాపురమెళ్ళావా అనే విషాద గేయం అందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనే మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.


పెళ్లి సంబరాలు ముగియకముందే.. దీవించిన బంధువులు వెనుదిరగకముందే.. పెళ్లింట చావుగంట మోగింది. పెళ్లైన కొద్ది గంటలలోనే నవ వధువు మృతి చెందిన ఘటన దబ్బగెడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో వివాహం జరిగిన కొన్ని గంటల వ్యధిలో వధువు అఖిల మృతి చెందడంతో దబ్బగెడ్డ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

పార్వతీపురంకు చెందిన వెత్స అఖిలకు దబ్బగెడ్డ గ్రామంకు చెందిన భాస్కరరావుకు గత రాత్రి వివాహం జరిగింది. వివాహ అనంతరం నిద్రించిన వధువు అపస్మారక స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించమని సూచించారు.


Also Read: అమ్మాయి కన్నీటి లేఖ.. హత్య ? ఆత్మహత్య?

సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించగా.. వైద్యులు పరీక్షించి మార్గమధ్యలోనే చనిపోయినట్లు నిర్ధారించారు. మరణానికి గల కారణలను పోస్టుమార్టం నివేదికలో తెలియజేస్తామన్నారు. ఇంట్లో శుభకార్యం జరిగిన కొన్ని గంటల్లోనే ఇలా జరగడంతో కుటుబసభ్యులలో విషాదం అలుముకుంది.

Related News

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: లిక్కర్ కేసులో కొత్త విషయాలు.. ముడుపుల చేర్చడంలో వారే కీలకం, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Big Stories

×