Big Stories

Vizag Diploma Student Incident: అమ్మాయి కన్నీటి లేఖ.. హత్య ? ఆత్మహత్య?

Diploma Student Suicide At Vizag

- Advertisement -

Diploma Student Suicide At Vizag(Latest news in Andhra Pradesh): పురిటి నొప్పులు.. పుడమి తల్లులు.. ఆకాశంలో సగం.. అమ్మాయిలదే భవిష్యత్తు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల గొప్పతనంపై మనం వాడే డైలాగులు.. అన్నీ ఇన్నీ కాదు. కాని రియాలిటీ ఏంటి.. అందరూ ఉన్నప్పుడు ఆకాశానికెత్తే మృగాళ్లు.. ఎవ్వరూ లేనప్పుడు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. కామవాంఛతో వారి బతుకులను చిధిమేస్తున్నారు. వైజాగ్‌లోని మధురవాడలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ.

- Advertisement -

చదువు చెప్పి జీవితాన్ని చక్కదిద్దాల్సిన వాళ్లే.. ఆ యువతి జీవితాన్ని నాశనం చేశారు. లైంగికంగా వేధించారు. ఎవరికి చెప్పుకోవాలో.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడేశారు. ఫలితం.. ఆ అమ్మాయి ఆత్మహత్య. కొమ్మాదిలో ఇంటర్‌ ఫస్టియర్ చదువుతున్న రూపశ్రీ ఆత్మహత్య చేసుకుంది. ఓ రకంగా చూస్తే సూసైడ్ కాదు ఇది. మర్డర్.. కోల్డ్ బ్లెడ్డెడ్ మర్డర్ ఇది. ఇది ఆరోపణ కాదు. ఆ అమ్మాయి చనిపోయేముందు రాసిన సూసైడ్ లెటర్ చూస్తే.. అర్థమయ్యేది ఇదే. లైంగింకంగా ఇబ్బంది పెట్టారు. అందులో తోటి విద్యార్థులు ఉన్నారు. చదువులు చెప్పే లెక్చరర్ ఉన్నాడు.

మరి ఇక ఎవరికి చెప్పుకోవాలి. ఇంట్లో చెప్పలేను.. కాలేజీ యాజమన్యానికి చెప్పినా లాభం లేదు. పోలీసులను ఆశ్రయిద్దామంటే. మార్ఫ్‌డ్ ఫోటోలు రిలీజ్‌ చేస్తారని బెదిరింపు. ఇక్కడ నేనే కాదు.. నాలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. నేను చస్తేనైనా.. వారికి న్యాయం జరుగుతోంది. ఇది ఆ అమ్మాయి రాసిన డెత్ నోట్.  ఆ అమ్మాయి రాసిన లెటర్ ఏంటో ఓ సారి చూద్దాం.. తను చనిపోతేనే న్యాయం జరుగుతుందన్న ఆలోచన వచ్చిందంటే. ఆ యువతి ఎంత వేదన అనుభవించి ఉండాలి. ఎంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటే ఇలాంటి ఆలోచన వచ్చి ఉండాలి. మరి తనకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వారికి శిక్ష పడుతుందా?

ఈ నోట్ చదివాక తెలిందేంటంటే.. ఆడవాళ్లు చదువుకునే చోట కూడా ఫ్రీడమ్ లేదని తేలుతోంది. ఒక్క కాలేజ్‌లోనే కాదు.. ఆఫీసుల్లో పనిచేసే చోట.. వ్యాపారాలు చేసే చోట.. రోడ్లపై.. చివరికి ఆన్‌లైన్‌లో కూడా
ఇలా ప్లేస్‌ ఏదైనా.. వారికి వేధింపులు కామనయ్యాయి. ఏదో మూలన ఆడవాళ్లపై అయితే అత్యాచారాలు. లేదంటే వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి..

Also Read: కలియుగం.. కౌంటర్ ఎటాక్, అసలేం జరిగింది?

మరి చట్టాలు లేవా? ఇలా చేసే వారికి శిక్షలు లేవా? ఉన్నాయి.. కానీ ఫిర్యాదు చేస్తున్నవారు ఎంతమంది? చట్టాలు ఎన్ని తెచ్చినా ఇవేవి ఆగడం లేదు. అప్పుడు పుట్టిన చిన్నారా? మైనరా? ప్రెగ్నెంటా? ముసలివారా? ఇలా ఏమీ చూడకుండా ఎవ్వరినీ వదలడం లేదు మృగాళ్లు.. లైంగికానందం కోసం శాడిస్టిక్‌ ప్లెజర్‌ను ఆశ్రయిస్తున్నారు. వీలైదే బెదిరిస్తున్నారు.. లేదంటే చంపేస్తున్నారు. చాలా మంది మహిళలకు లైంగిక వేధింపులకు గురైతే ఏం చేయాలో అవగాహన ఉండటం లేదు. అవగాహన పెంచుకోవాల్సిన అవసరం మహిళలకు ఉంది. పెంచాల్సిన అవసరం తల్లిదండ్రుల నుంచి మొదలుపెడితే.. అందరిపై ఉంది. ఈ అవగాహన లేకనే చాలా మంది వారిలో వారు కుమిలిపోతున్నారు. కొందరు నిస్సహాయ స్థితిలో వాళ్లు చెప్పింది చేస్తున్నారు. మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. వైజాగ్‌లో రూపశ్రీ సూసైడ్‌కు కారణం ఇదే..

రూపశ్రీ కొంచెం ధైర్యం చేసి ఇంట్లో విషయం చెబితే. పరిస్థితులు ఎలా ఉండేవో..? కాలేజ్‌ యాజమాన్యంపై నమ్మకం లేనప్పుడు.. ఇంట్లో వారినైనా నమ్మితే బాగుండేది. కాలేజీలో కూడా ఇలాంటి సిట్యూవేషన్‌లను డీల్ చేసేందుకు.. సరైన వ్యవస్థ ఉండాలి. నిజానికి అలా ఉంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. రూపశ్రీ మన మధ్యే ఉండేది. ఆమెను వేధించిన కీచకులు జైల్లో ఉండేవారు..

కానీ అన్ని చట్టప్రకారమే జరగవు అమ్మాయిలను లోకువగా చూసే పరిస్థితి పోవాలి అవకాశం ఇస్తే ఆకాశం కూడా వాళ్లకు హద్దు కాదు. కానీ ఇంత నీచంగా వ్యవహరించడమే దారుణం.. ఇకనైనా మారండి.. పరిస్థితులను మార్చండి. ఆమెకు భద్రతనివ్వండి.స్వేచ్ఛగా విహరించనివ్వండి. మహిళలు కూడా అన్నింటికీ ఆత్మహత్యే శరణ్యమనుకోకూడదు. తప్పు చేసింది మనం కాదు.. వారు.. చనిపోవాల్సింది మనం కాదు.. వాళ్లు.. ధైర్యంగా పోరాడటం నేర్చుకోవాలి.. అంతేకాని పిరికితనంతో ప్రాణాలు తీసుకోకూడదు. మీరు చేసే ఒక చిన్న తప్పు.. మీ కన్న తల్లిదండ్రులకు ఎంత శోకాన్ని మిగిలిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. న్యాయం జరగాలంటే తీసుకోవాల్సింది ప్రాణం కాదు.. చేయాల్సింది యుద్ధం.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News