Rishab Pant: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి 5వ టెస్ట్ కి రోహిత్ శర్మ లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు తీరు మారలేదు. సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత స్టార్లు మరోసారి విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ బూమ్రా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Also Read: Gautham Gambhir: గంభీర్ కు చుక్కలు చూపిస్తున్న ఫ్యాన్స్… #RIP Gambhir అంటూ !
ఈ మ్యాచ్ కోసం టీమిండియా రెండు మార్పులు చేసింది. రోహిత్ స్థానంలో గిల్, పేస్ బౌలర్ ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ద్ కృష్ణ జట్టులోకి వచ్చారు. ఇక బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు 11 పరుగులకే తొలి వికెట్ ని కోల్పోయింది. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్ కేఎల్ రాహుల్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో సామ్ కాన్ స్టాస్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన బ్యాటర్లు కూడా కుదురుకోలేకపోయారు. యశస్వి జైస్వాల్ (10), గిల్ (20) పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. ఇక కాస్త నెమ్మదిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటున్న సమయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో మారు తేలిపోయాడు. ఎప్పటిలానే ఈసారి కూడా తన వికెట్ సమర్పించుకున్నాడు.
69 బంతుల్లో 17 పరుగులు చేసిన కోహ్లీ బోలాండ్ బౌలింగ్ లో థర్డ్ స్లిప్ లో ఉన్న వెబ్ స్టర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆఫ్ సైడ్ వెళ్ళే బంతిని అనవసర షాట్ కి ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు కోహ్లీ. దీంతో నాలుగు వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో పడింది. అయితే వికెట్ కీపర్ రిషబ్ పంత్ {Rishab Pant} మాత్రం జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆచితూచి ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు.
Also Read: Shubman Gill: రూ.450 కోట్ల స్కాం.. గిల్ తో పాటు మరో నలుగురికి CID నోటీసులు !
కాగా ఆసీస్ బౌలర్ స్టార్క్ వేసిన బౌన్సర్ కి రిషబ్ పంత్ {Rishab Pant} కి గాయమైంది. బంతి మోచేతి పైన తాకడంతో కాస్త వాపు వచ్చింది. బాల్ తాకిన స్థానంలో మచ్చలా ఏర్పడడంతో.. వెంటనే సిబ్బంది వచ్చి చికిత్స అందించారు. అయితే పంత్ కి గాయం కాగానే ఆసీస్ బౌలర్ స్టార్క్ వచ్చి {Rishab Pant} పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. ఇక పంత్ తిరిగి ఆటను కొనసాగించడం గమనార్హం. ప్రస్తుతం భారత జట్టు 51 ఓవర్లలో 108 పరుగులు చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది. రిషబ్ పంత్ (32*), రవీంద్ర జడేజా (11*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ చివరి టెస్ట్ లో గెలిచి సిరీస్ ని సమం చేయాలని ప్రయత్నాలు చేస్తుంది భారత జట్టు. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే డబ్ల్యూటిసి ఫైనల్ కి వెళ్లే అవకాశాలు సజీవంగా ఉంటాయి.
Rishabh Pant took a number of heavy hits to the body.#AUSvIND pic.twitter.com/TdyJ1qhm9C
— cricket.com.au (@cricketcomau) January 3, 2025