Big Stories

AP Elections 2024: టెట్ ఫలితాలకు ఈసీ బ్రేక్.. డీఎస్సీ వాయిదా..

VolunteersVolunteers: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు ఎటువంటి డబ్బులు పంపిణీ చేయవద్దని ఆంక్షలు విధించింది.

- Advertisement -

దీంతో పాటులో రాష్ట్రంలో నిర్వహించబోయే డీఎస్సీని కూడా ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేస్తున్నట్లు ఆదేశాల్లో వెల్లడించింది. త్వరలోనే వెల్లడి కాబోయే ఏపీ టెట్ ఫలితాలను కూడా బ్రేక్ వేయాలని ఆదేశించింది.

- Advertisement -

వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సీఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు జిల్లా ఎన్నికల అధికార వద్ద వాటిని సబ్మిట్ చేయాలని ఆదేశించింది. ఈ విషయాన్ని లేఖ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. అవసరం తప్పదు అనుకుంటే నగదు బదిలీ ద్వారా పథకాలు కొనసాగించవచ్చని సీఈసీ స్పష్టం చేసింది.

ఏప్రిల్ 3వ తేదీన పింఛన్ దారులకు నగదు పంపిణీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ ఆంక్షలను విధించింది. సీఈసీ విధించిన ఈ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ దారులకు నగదు పంపిణీపై ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News