BigTV English

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Inquiry on  Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Inquiry on Sakshi Newspaper: జగన్ టార్గెట్‌గా చంద్రబాబు సర్కార్ పావులు కదుపుతోందా? ప్రజాధనాన్ని జగన్ సర్కార్ దుర్వినియోగం చేసిందా? క్విడ్ ప్రోకో ద్వారా సాక్షి పత్రిక కొనుగోళ్లు చేయించిందా? బుధవారం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ఎలాంటి చర్చ జరిగింది? విచారణ చేపట్టాలని మంత్రులే స్వయంగా సీఎం చంద్రబాబుకు చెప్పారా? జగన్‌కు మరిన్ని కష్టాలు తప్పవా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


మాజీ సీఎం జగన్ అడ్డంగా దొరికిపోయారు. సాక్షి పేపర్‌ను కొనుగోలు కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా గడిచిన రెండేళ్లలో 205 కోట్ల రూపాయలు కేటాయించింది. వాలంటీర్ల ద్వారా సాక్షి పేపర్‌ను కొనుగోలు చేయింది గత వైసీపీ సర్కార్. పత్రికను కొనుగోలు చేసేందుకు వీలుగా వాలంటీర్లకు నెలకు 200 రూపాయలు చొప్పున రెండేళ్ల పాటు ఆ మొత్తాన్ని కేటాయించింది. అక్షరాలా దాని విలువ 205 కోట్ల రూపాయలు.

కేవలం ఒక్క పత్రికను మాత్రమే కొనుగోలు చేసింది. గత సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, పట్టణ సచివాలయాలను ఏర్పాటు చేసింది.  వాటికి కేవలం సాక్షి పేపర్ మాత్రమే వచ్చేది. ఇందుకోసం జగన్ సర్కార్ 205 కోట్ల రూపాయలను కేటాయించింది. మిగతా పత్రికలు రాకుండా చేయడంతో అడ్డంగా దొరికిపోయింది అప్పటి ప్రభుత్వం. మరో విషయం ఏంటంటే.. చాలా మున్సిపాలిటీల్లో సాక్షి పేపరు కొనుగోలు చేసేందుకు ఏడాదిపాటు అడ్వాన్సు ముందుగానే ఇచ్చినట్టు అంతర్గత సమాచారం.


Also Read: ఒక్క ‘సాక్షి’కే రూ.300 కోట్లా? అంటే ఐదేళ్లలో..? అయ్య బాబోయ్, జగన్ మామూలోడు కాదు!

సింపుల్ చెప్పాలంటే ఓపెన్‌గా క్విడ్ ప్రోకో చేశారన్నది మంత్రుల మాట. ప్రభుత్వం ఖజానా నుంచి సాక్షి పేపర్ కొనుగోలు చేయించడం, తద్వారా దాని సర్కులేషన్ పెంచడం, ప్రభుత్వ ప్రకటనలు కేవలం సాక్షికి 440 కోట్ల రూపాయలు కేటాయించడం వెనుక అసలు కథ అని చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై జగన్ సర్కార్‌ ఇరుక్కోవడం ఖాయమనే వార్తలు జోరందు కున్నాయి. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై ప్రధానంగా దాదాపు అరగంటకు పైగానే మంత్రులు చర్చించారు. ఇందులో నిజాలు నిగ్గు తేల్చాలంటే విచారణ చేయించాలని మంత్రులు చెప్పడంతో సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు.

గడిచిన ఐదేళ్లలో వైసీపీ సర్కార్ కేవలం ప్రకటన కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఐదేళ్లలో ఒక్క సాక్షికి ప్రకటన రూపంలో 403 కోట్ల రూపాయలను అసెంబ్లీ సమావేశంలో సమాచార శాఖ మంత్రి పార్థసారథి బహిరంగ ప్రకటన చేశారు.

ఒక్క సాక్షికి 403 కోట్ల రూపాయల ప్రకటనలు ఇవ్వగా, మిగతా 20 పత్రికలకు ఇచ్చిన ప్రకటన మొత్తం 488 కోట్లు. ఈ లెక్కన సాక్షిదే అగ్రభాగం అన్నమాట. ఈ వ్యవహారంపై ఈనాడు సంస్థ న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేసింది కూడా.

కేవలం సాక్షికి అధికంగా ప్రకటనలు ఇవ్వడంపై డిపార్టుమెంట్ విచారణ జరుగుతోంది. వీటిలో చాలా పత్రికలకు నిధులు విడుదల చేయలేదు. గతంలో డిప్యూటేషన్‌పై వచ్చిన పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. మొత్తానికి సాక్షి పత్రిక వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ తీగ లాగితే డొంక కదులుతోందని చెప్పవచ్చు. రాబోయే దీనిపై ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

ALSO READ:  దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×