Fatal Extramarital Affair| భార్యాభర్తల బంధం ప్రేమ, నమ్మకం అనే కంటికి కనిపించని భావాలపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరి మధ్య ఒకరిపట్లు మరొకరు చూపే గౌరవం, కష్టసుఖాల్లో ఒకరికి తోడు మరొకరు నిలవడంతో ఈ బంధం మరింత బలపడుతుంది. కానీ ఇద్దరిలో ఏ ఒకరిలో నైనా ఈ భావాలు లోపించినా ఆ బంధం పతనానికి కారకులైనట్లే. అందుకే ఒక భార్య తన భర్త పట్ల అవిశ్వాసంగా ఉండడంతో వారి కాపురం చెల్లాచెదురైంది. ఆ తరువాత ఇద్దరిలో ఒకరు చనిపోయారు. ఈ ఘటన దేశ రాజధాని సమీపంలోని గ్రేటర నోయిడాలో జరిగింది.
గ్రేటర్ నోయిడాకు సమీపంలోని బిరోండా గ్రామంలో ఒక పబ్లిక్ టాయిలెట్ (శులభ్ శౌచాలయ్) నిర్వహకుడు మహేశ్ (29) శవం టాయిలెట్ మిద్దెపై లభించింది. దీంతో పోలీసులు సమాచారం అందుకొని విచారణ చేశారు. టాయిలెట్ కాంట్రాక్టర్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. అతను మహేశ్ తన భార్య, పిల్లాడితో సమీపంలోని ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్నాడని తెలిపాడు. దీంతో పోలీసులు మహేశ్ భార్య కోసం వెళ్లగా ఆమె ఇంట్లో లేదని పొరుగింటి వారు చెప్పారు.
పోలీసులు మహేశ్ ఇంటి సమీపంలోని సిసిటీవి వీడియోలను పరిశీలించగా ఆమె మరో యువకుడితో ఇంటి నుంచి బయలు దేరి నట్లు తెలిసింది. దీంతో పోలీసులకు మహేశ్ భార్యపై అనుమానం కలిగింది. పోలీసులు మహేశ్ భార్య రైల్వే స్టేషన్ కు వెళ్లినట్లు ఆ తరువాత రైలు ప్రయాణం చేసి మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ జిల్లా మజరా గ్రామానికి వెళ్లినట్లు తెలుసుకున్నారు.
Also Read: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట, రెండో పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన మహిళ
ఆ తరువాత నోయిడా పోలీసులు.. మధ్య ప్రదేశ్ పోలీసులు సాయంతో మహేశ్ భార్య, ఆమెతో ఉన్న యువకుడిని వారం రోజుల క్రితం అరెస్టుచేశారు. ఆ తరువాత వారిద్దరినీ పోలీసులు తమ పద్ధతిలో ప్రశ్నించగా.. ఇద్దరూ షాకింగ్ నిజం చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛత్తర్ పూర్ జిల్లా మజరా గడరాహు గ్రామానికి చెందిన పూజా(24) అదే గ్రామానికి చెందిన ప్రహ్లాద్ అనే యువకుడిని ప్రేమించింది. కానీ ఆ సమయంలో ప్రహ్లాద్ కు ఏ ఉద్యోగం లేకపోయేసరికి ఆమెకు మహేశ్ అనే యుకుడితో తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఒక సంవత్సరం తరువాత ఒక పిల్లాడు పుట్టాడు.
అయితే వివాహం తరువాత మహేశ్ కు వ్యాపారంలో నష్టాలు రావడంతో అతను ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్లాడు. అక్కడ ఉద్యోగం దొరకకపోవడంతో.. మహేశ్ తన కుటుంబం ఆర్థిక కష్టాల గురించి ఆలోచించి చివరికి నోయిడా సమీపంలోని చిరోండా గ్రామంలో ఒక పబ్లిక్ టాయిలెట్ లో నిర్వహకుడిగా ఉద్యోగంలో చేరాడు. ఆ తరువాత ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని తన భార్య పూజ, కొడుకుతో పాటు అక్కడే స్థిరపడ్డాడు. అయితే పూజ తన పాత ప్రేమికుడిని మరిచిపోలేకపోయింది. తన భర్త ఢిల్లీకి వెళ్లినప్పుడు కూడా తన ప్రియుడితో హాయిగా గడిపింది.
కానీ ఇప్పుడు తన భర్త ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడాకు తీసుకురాగానే ఆమెకు తన ప్రియుడితో కలవడం కష్టంగా మారింది. దీంతో ఆమె ఒక ప్లాన్ వేసింది. తన దూరపు బంధువు అయిన ప్రహ్లాద్ కోసం ఒక ఉద్యోగం చూడమని భర్తను అడిగింది. దీంతో కష్టజీవి మహేశ్.. ఒక సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఉందని చెప్పాడు. ఇది విని పూజకు వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేసి నోయిడాలో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఉందని వెంటనే బయలుదేరి రావాలని చెప్పింది.
Also Read: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!
పూజ మాటలు విన్ని ప్రహ్లాద్ కూడా పూజ నివసించే ప్రాంతానికి సమీపంగా ఒక చిన్న గది అద్దకుతీసుకున్నాడు. ఆ తరువాత మహేశ్ ఇంట్లో లేని సమయంలో పూజను కలిసేందకు ప్రహ్లాద్ వారి ఇంటికి వెళ్లేవాడు. అలా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఒకరోజు నైట్ డ్యూటీకి వెళ్లిన మహేశ్ తన ఇంటికి అర్దగంట తరువాత తిరిగి వచ్చాడు. అప్పుడు ఆ సమయంలో చూడకూడని దృశ్యం అతనికి కళ్లకు కనిపించింది.
పూజ, ప్రహ్లాద్ ఇద్దరూ శృంగారం చేసకుంటున్నారు. ఈ దారుణం చూసిన తరువాత మహేశ్, ప్రహ్లాద్ మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవలో మహేశ్ ను అతని భార్య పూజ ఒక కత్తెర తీసుకొని పలుమార్లు పొడిచింది. దీనికి తోడుగా ఆమె ప్రియుడు ప్రహ్లాద్ కూడా మహేశ్ పై తన పక్కనే ఉన్న కత్తితీసుకొని పొడిచాడు. అలా మహేశ్ అక్కడికక్కడే మరణించిన తరువాత అతని శవం తీసుకొని ఇద్దరూ పబ్లక్ టాయిలెట్ వద్దకు వెళ్లారు. అక్కడ టాయిలెట్ మిద్దె భాగంపై ఎవరూ రారని ఆలోచించి అక్కడ మహేశ్ శవాన్ని పడేసి.. అక్కడి నుంచి పారిపోయారు.
ఆ తరువాత ట్రైన్ ఎక్కి మధ్యప్రదేశ్ లోని తమ స్వగ్రామంలోని ఒక బంధువు ఇంట్లో తలదాచుకున్నారు. కానీ పోలీసులు వారిద్దరినీ చాకచక్యంగా పట్టుకున్నారు. పూజ, ప్రహ్లాద్ పై హత్యాకేసు నమోదు చేసి కోర్టులో ఇద్దరు నిందితులను సమర్పించారు. ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ దశలో ఉంది.