BigTV English
Advertisement

Chiranjeevi: మెగాస్టార్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా.. షూటింగ్ ఆపి మరీ భార్యతో కలిసి..?

Chiranjeevi: మెగాస్టార్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా.. షూటింగ్ ఆపి మరీ భార్యతో కలిసి..?

Chiranjeevi: ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఫిబ్రవరి 14 రానే వచ్చింది. ఇవాళ ప్రేమ జంటలకు చాలా ప్రత్యేకమైన రోజు. చాలామంది తమ ప్రేమను రకరకాలు తెలుపుకుంటారు. కొందరు సినిమాలు, పార్కులు, రెస్టారెంట్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. మరికొందరెమో వెకేషన్ టూర్ అంటూ దేశ విదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే అలా ఎంజాయ్ చేసేందుకు సినీ సెలబ్రెటీలు ముందుంటారు.


అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. వాలెంటైన్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరు తన సతీమణి సురేఖతో ఓ ట్రిప్‌ను ప్లాన్ చేశారు. మరి ఇవాళ స్పెషల్ డే కావడంతో చిరు తన భార్యతో ఎక్కడికి వెళ్లారు.. ఎలాంటి సర్పైజ్ ప్లాన్ చేశారో తెలుసుకుందాం.

వాలెంటైన్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరు తన సతీమణి సురేఖతో కలిసి అమెరికా పయనమయ్యారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతేకాకుండా తాను నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీపై కూడా ఓ అప్డేట్ అందించారు.


READ MORE: చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పండగే

‘‘ నా బెటర్ హాఫ్ సురేఖతో ఒక చిన్న సెలవు కోసం అమెరికాకి బయలుదేరాను. నేను తిరిగి వచ్చిన వెంటనే విశ్వంభర మూవీ చిత్రీకరణను పునఃప్రారంభిస్తాను. మీ అందరినీ త్వరలో కలుస్తాను. అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు’’ అంటూ విమానంలో సురేఖతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భార్యతో అలా సమయం గడపాలి అనుకోవడం చాలా మంచి విషయమేనని కామెంట్లు పెడుతున్నారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో చిరు ప్రస్తుతం ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ‘భోళా శంకర్’తో ఊహించని ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్ ‘విశ్వంభర’ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

READ MORE: చిరు కెరీర్‌లోనే రికార్డ్ రేటుకు ‘విశ్వంభర’ ఓవర్ సీస్ రైట్స్ ?

ఈ మూవీ కోసం చిరు తెగ కష్టపడుతున్నాడు. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ చెమటోడుస్తున్నాడు. రీసెంట్‌గా అందుకు సంబంధించిన వీడియోను చిరు పంచుకోగా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వయసులో కూడా మెగాస్టార్ జిమ్‌లో వర్కవుట్ చేస్తూ ఇంతలా కష్టపడుతుండటం చూసి మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఇక త్వరలోనే ప్రారంభం కానున్న షెడ్యూల్‌లో హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిష మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్య సురేఖతో సమయాన్ని గడిపిన తర్వాతే మళ్లీ షూటింగ్‌లో అడుగుపెట్టబోతున్నట్లు చిరు తెలపడంతో.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ బ్రేక్ పడింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×