BigTV English

Chandrababu: వివేకాది అంతఃపుర హత్యే.. అడ్డు వస్తున్నారనే.. అవినాశ్‌రెడ్డిపై చంద్రబాబు ఆరోపణ

Chandrababu: వివేకాది అంతఃపుర హత్యే.. అడ్డు వస్తున్నారనే.. అవినాశ్‌రెడ్డిపై చంద్రబాబు ఆరోపణ

Chandrababu: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఏపీ రాజకీయాల్లో ప్రకంపణలు రేపుతోంది. కోర్టుకు సీబీఐ సడ్మిట్ చేసిన కౌంటర్ రిపోర్టులో అనేక సంచలన విషయాలు ఉన్నాయి. వైఎస్ అవినిశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలే కుట్రదారులు అనేలా సీబీఐ రిపోర్టు ఉంది. 40 కోట్లకు డీల్ మాట్లాడారని.. సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు వివేకాను చంపేశారని సీబీఐ వెల్లడించింది. వైసీపీని ఇరుకునపెట్టేలా సీబీఐ నివేదిక ఉండటంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. తాజాగా ఏలూరులో నిర్వహించిన టీడీపీ జోన్‌-2 సమీక్షా సమావేశంలో చంద్రబాబు పలు విమర్శలు చేశారు.


వైఎస్‌ వివేకానందరెడ్డిని భయంకరంగా హత్య చేసి.. ఆ విషయాన్ని దాచిపెట్టేందుకు అనేక కుట్రలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్యకు ముందు, తర్వాత ఏం జరిగిందో సీబీఐ దర్యాప్తులో అన్నీ బయటకు వచ్చాయన్నారు. ‘‘హత్యకు ముందు ఎంపీ అవినాష్‌ ఇంట్లో కుట్ర జరిగినట్లు దర్యాప్తులో తేలింది.. రాజకీయాలకు అడ్డు వస్తున్నారనే వివేకాను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినా ఎంపీ అవినాష్‌.. అమాయకుడని వైసీపీ నేతలు చెబుతున్నారు.. వివేకా హత్యను టీడీపీ నేతలపై నెట్టేందుకు ప్రయత్నించారు.. వివేకా హత్యతో అవినాష్‌కు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు.. వివేకా హత్యకు ముందు అవినాష్‌ ఇంట్లో అందరూ కూర్చున్నారు.. హత్య తర్వాత లోటస్‌ పాండ్‌కు ఫోన్‌ వెళ్లింది. ఇవన్నీ చూస్తుంటే.. వివేకాది ముమ్మాటికీ అంతఃపుర హత్యే అని తేలిపోతోంది” అని చంద్రబాబు అన్నారు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×