BigTV English

Related Diseases:గోధుమల వల్ల ఏర్పడే వ్యాధులపై పరిశోధనలు..

Related Diseases:గోధుమల వల్ల ఏర్పడే వ్యాధులపై పరిశోధనలు..

Related Diseases:వ్యవసాయంలో టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడినా.. పంటలను నాశనం చేసే కొన్ని కీటకాలను మాత్రం దూరం చేయడం కష్టంగానే ఉంటుంది. వ్యవసాయంలో మనిషి చేసే దాదాపు ప్రతీ పనిని టెక్నాలజీ కూడా చేస్తుంది. కానీ కీటకాల విషయంలో మాత్రం టెక్నాలజీ ఇంకా మెరుగుపడాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాజాగా గోధుమల పంటపై చేసిన పరిశోధనల్లో వారు ఒక రకమైన ఫంగస్‌ను గుర్తించారు.


గోధుమలలో పైరిక్యులేరియా ఒరిజే అనే ఫంగస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఫంగస్‌తో ఉన్న గోధుమలను తినడం వల్ల మనుషులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వారు తెలిపారు. 1985లోనే బ్రెజిల్‌లో చాలామంది ఈ ఫంగస్ బారినపడ్డారు. ఇది అప్పట్లోనే ప్రాణంతక వ్యాధిగా అందరినీ బయటపెట్టింది. బ్రెజిల్ తర్వాత సౌత్ అమెరికా, బంగ్లాదేశ్, జాంబియా వంటి దేశాలకు కూడా ఈ ఫంగస్ వ్యాపించింది.

ఇప్పటికే గోధుమల పంటకు సంబంధించి ఎన్నో సమస్యలు మానవాళితో పాటు ప్రపంచ వాతావరణాన్నే ఇబ్బంది పెడుతున్నాయి. వాటితో పాటు ఈ పైరిక్యులేరియా ఒరిజే ఫంగస్‌కు కూడా చెక్ పెట్టాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే వీట్ బ్లాస్ట్ అనే వ్యాధి మానవాళిని ఇబ్బంది పెడుతోంది. వీటన్నింటిని అరికట్టడం కోసమే గోధుమలను పండించడంలో కొత్త రకమైన ప్రక్రియలను పాటించాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందులో ఒకటి ఇంటెన్సివ్ బ్రీడింగ్.


గోధుమలలో ఉంటే అన్ని రకాలను స్టడీ చేసే పనిలోపడ్డారు శాస్త్రవేత్తలు. ఇది ఇంటెన్సివ్ బ్రీడింగ్‌కు బాగా ఉపయోగపడుతుందని వారు తెలిపారు. వారు చేసిన పరిశోధనల్లో గోధుమలలో ఈ ఫంగస్ వ్యాప్తికి ఉపయోగపడే రెండు రకాల మాలిక్యూల్స్‌ను గుర్తించారు. ఈ మాలిక్యూల్స్ అనేది మోతాదులో ఉంటే గోధుమల వల్ల వ్యాప్తి చెందుతున్న ఎన్నో విధాల వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. వీట్ బ్లాస్ అనే వ్యాధికి ఆర్‌డబ్ల్యూటీ 3 అనే మాలిక్యూల్ మోతాదులో లేకపోవడమే అని శాస్త్రవేత్తలు గుర్తించారు.

పాథగాన్స్, వీట్ జీన్స్ గురించి తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు మరికొన్ని పరిశోధనలు చేయనున్నారు. ఫంగస్ ఎలా తయారవుతుంది అని గుర్తించిన తర్వాత అసలు అది పంటలపై ఎలా వ్యాప్తి చెందుతుంది అనే అంశంపై పరిశోధనలు కొనసాగనున్నాయి. ఇప్పటికీ బంగ్లాదేశ్, జాంబీ ప్రాంతాల్లో గోధుమలు తినడం వల్ల దానికి సంబంధించిన ఎన్నో వ్యాధులు అక్కడివారిని ఇబ్బంది పెడుతున్నాయి. పూర్తిగా ఈ వ్యాధులు అన్నింటికి పరిష్కారం కనుక్కోవడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు ముందుకెళ్తున్నారు.

Fingertip:వేలి స్పర్శతో దానిని కనిపెట్టవచ్చు..

America China:ఆ విషయంలో అమెరికా, ఇండియా మధ్య ఒప్పందం..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×