E-Paper
Advertisement

Chandrababu Eye Surgery : చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తి .. ఇంటికి చేరిన టీడీపీ అధినేత..

Chandrababu Eye Surgery :  చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తి .. ఇంటికి చేరిన టీడీపీ అధినేత..
Advertisement

Chandrababu Eye Surgery : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్‌ పూర్తయింది. ఏఐజీ ఆస్పత్రిలో పరీక్షల అనంతరం ఎల్వీ ఆస్పత్రిలో కంటి చికిత్స చేశారు వైద్యులు. చికిత్సలో భాగంగా క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేశారు. ఈ ఆపరేషన్‌ దాదాపు 2 గంటలపాటు సాగింది. ఆపరేషన్‌ పూర్తికాగానే ఆయన తిరిగి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లారు. చికిత్స నేపథ్యంలో కొద్ది రోజులపాటు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పై విడుదలయిన విషయం తెలిసిందే.

చంద్రబాబు రెండు సార్లు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన కుడి కంటికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. చంద్రబాబు ఎడమ కంటికి ఇదివరకే కాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఆయనకు ఈనెల 28 వరకు బెయిల్ వచ్చింది.

Advertisement

ఇదిలా ఉండగా చంద్రబాబు దాఖలు చేసిన కేసులపై విచారణ కొనసాగుతూనే ఉంది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉన్నత న్యాయస్థానం ఈ కేసుని ఈ నెల 22కు వాయిదా వేసింది.

Tags

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×