Intinti Ramayanam Today Episode july 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరు ఫంక్షన్ అయిపోయేంత వరకు పెళ్లి సంబంధం గురించి ఎవరికీ చెప్పకండి అవని గురించి మీకు తెలుసు కదా? నాకు మాట ఇవ్వండి అని పల్లవి అడుగుతుంది.. పార్వతి పల్లవి కోరిక మేరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పను అంటుంది. మాట ఇస్తుంది. ప్రణతి ఇంకా రెడీ అవ్వలేదు ఏంటి ఫంక్షన్ కి రావట్లేదా అని అడుగుతుంది.. ఆ ఇంటికి రావాలంటే భయంగా ఉంది వదిన. అందుకే రెడీ అవ్వలేదు అని అంటుంది. నాకు అందరి మీద కన్నా నీ మీద నమ్మకం ఎక్కువ వదినా.. నాకు భరత్ నుంచి పెళ్లి చేస్తానని మాటీవీ వదిన అని అడుగుతుంది. అవని మాటిస్తున్నాను కచ్చితంగా మీ పెళ్లి జరుగుతుంది అని అంటుంది. అందరూ కలిసి క్యాబ్లో వెళ్తారు.
అక్షయ్ అవనిని కాపాడతాడు.. అవని బట్టల షాప్ కెళ్ళి తీసుకొని వస్తూ ఉంటే ఎదురుగా పక్క వీధి వాళ్ళు వచ్చి ఆమెను అల్లరి చేసే పని చేస్తారు.. ఈ వయసులో నువ్వు భర్తకు దూరంగా ఉన్నావు అనుకుంటా మా తోడు నీకు కావాలనుకుంటా.. నువ్వు అను నీకు స్వర్గాన్ని చూపిస్తామని అవన్నీ తో పిచ్చిపిచ్చిగా మాట్లాడతారు.. అక్షయ్ నా భార్య మీద చెయ్యి వేస్తె చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అది చూసిన అవని మురిసిపోతుంది.అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి ఇంటికి చక్రధర్ రావడం చూసి కమల్ శ్రీకర్ ఇద్దరు నిన్ను ఎవరు పిలిచారు? నువ్వు ఎందుకు వచ్చావు? మా ఇంటికి? పిలువని పేరంటానికి రావాల్సిన అవసరం నాకు లేదు మీ అమ్మ రమ్మని పిలిస్తేనే నేను వచ్చాను అని చక్రధర్ అంటాడు. ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందే గొడవ ఎలా ఉంది అని పల్లవి పార్వతితో చెబుతుంది.. పార్వతి శ్రీకర్, కమల్ దగ్గరకు వచ్చి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారు మామయ్య అని కూడా కొంచెం కూడా లేదా.. మర్యాద లేకుండా మాట్లాడతారు ఏంటి మీ మామయ్యని అత్తని రమ్మని పిలిచాను. నోరు అదుపులో పెట్టుకొని ఉండండి అని పార్వతి కొడుకులకు వార్నింగ్ ఇస్తుంది.
పల్లవి ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంది. మా నాన్న అంటే ఎందుకంత అసహ్యం మీకు. ఏంటి మంచి కోరే వారిలో మా నాన్న మొదటిగా ఉంటారు కానీ మీకెందుకు మా నాన్న అంటే ఇష్టం లేదు అని అరుస్తుంది. ఇక శ్రీకర్ కమల్ కు పార్వతి క్షమాపణ చెప్పమని కోరుతుంది.. వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోడు లే అమ్మ ఇంతకీ ప్రణతి పెళ్లిచూపులు గురించి ఎవరికి చెప్పలేదు కదా.. అది ముందు మనం చేయాలి ఆ తర్వాత ఏం జరిగినా పర్లేదు అని అంటాడు..
అప్పుడే స్కూటీపై అవని అక్షయ్ రావడం చూసి పార్వతీ షాక్ అవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు ఏంటి కొంపతీసి కలిసిపోయారా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రణతిని చూసి అవని షాక్ అవుతుంది.. అవును ప్రణతి నిన్నేంటి ఇలా రెడీ చేశారు అని అడుగుతుంది అవని.. ఏమో వదిన ఫంక్షన్ కోసం అని ఇలా రెడీ చేశారు అని ప్రణతి అంటుంది. ఏదో పెళ్లి చూపులకు రెడీ చేసినట్టు రెడీ చేశారు ఏదో జరుగుతుంది అని అవని ఆలోచిస్తూ వస్తుంది. కిందకు రాగానే పల్లవి వాళ్ళ నాన్నతో మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ పెళ్లి కూడా జరుగుతుంది నాన్న అని మాట్లాడుతూ ఉంటుంది.
పెళ్లిచూపులు గురించి ఎవరికీ అనుమానం రాకుండా పూర్తి చేయాలి అని అనుకుంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లిచూపులు జరిగితే పెళ్లి జరిగిపోతుంది అని ఫోన్లో మాట్లాడడం అవని వింటుంది.. ఎదురుగా అవన్నీ చూసి పల్లవి షాక్ అవుతుంది. మీ డాడీ ఇక్కడే ఉన్నాడు కదా మరి నువ్వెందుకు ఫోన్ మాట్లాడుతున్నావ్.. ఏదైనా చేయాలని చూస్తున్నావా? అలాంటివే ఏదైనా చేయాలని చూస్తే మామూలుగా ఉండదు. పిచ్చిపిచ్చి వేషాలు ఏదైనా వేయాలని చూసావో చేతలతో నీకు బుద్ధి చెప్తాను అని అవని వార్నింగ్ ఇస్తుంది.
Also Read: ప్రభావతికి షాకిచ్చిన మీనా.. గెలికిన శోభా..మీనాకు రోహిణి ఐడియా..
ఆ తర్వాత పెళ్లి చూపులు కోసం పెల్లింటి వాళ్ళు వస్తారు. పార్వతి వాళ్ళని ఇంట్లోకి తీసుకొని వస్తుంది. అందరికీ పరిచయం చేస్తుంది. కానీ అవనిని పరిచయం చేయదు. రాజేంద్రప్రసాద్ అవనీని పెద్ద కోడలుగా పరిచయం చేస్తాడు. పార్వతిని ఎవరు అని అడుగుతాడు రాజేంద్రప్రసాద్.. అవనీకి అనుమానం వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..