BigTV English

AP Govt: మహిళలకు చంద్రబాబు శుభవార్త, వచ్చే నెల నుంచే ఆ పథకం

AP Govt: మహిళలకు చంద్రబాబు శుభవార్త, వచ్చే నెల నుంచే ఆ పథకం

AP Govt:  ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అప్పల ఊబి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఓ వైపు అభివృద్ధి వైపు దృష్టి సారిస్తూ.. మరోవైపు సంక్షేమంపై ఫోకస్ చేసింది. ప్రజలకు అవసరానికి పనికి వచ్చే పథకాలు ప్రారంభిస్తున్నారు. తాజాగా శిశువుల రక్షణ కోసం గతంలో అమలు చేసిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ స్కీమ్  మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.


మళ్లీ ఎన్టీఆర్ కిట్

గతంలో 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. ముఖ్యంగా మహిళలపై కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని పథకాలు పేర్లు మార్చి కంటిన్యూ చేశారు.కొన్నింటికి నిధులు లేకపోవడంతో ఆపేశారు. ప్రస్తుతం కూటమి సర్కార్‌కు కేంద్రం నుంచి మద్దతు లభించడంతో అటు వైపు దృష్టి సారించింది.


తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళలు-శిశువుల కోసం గతంలో అమలు చేసిన స్కీమ్‌ని కూటమి ప్రభుత్వం పునః ప్రారంభిస్తోంది. బాలింతలకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లను అందజేయడానికి అధికారులు అంతా రెడీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

వచ్చే నెల నుంచి

జూన్ నెల నుంచి ఈ పథకం మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లో ప్రతీ ఏడాది లక్షల్లో కాన్పులు జరుగుతాయి. ఎన్టీఆర్ పేరుతో బేబీ కిట్ ఇవ్వడం వల్ల పుట్టిన పిల్లలకు మంచి జరుగుతుందని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

ALSO READ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతి

2016 టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్ల పేరుతో స్కీమ్ తెచ్చింది. గత వైసీపీ సర్కారులు ఈ పథకం పేరు డాక్టర్ వైఎస్సార్ బేబీ కిట్ గా మారింది. ఏడాది తర్వాత ఆ పథకానికి మంగళం పాడేసింది. నాలుగేళ్లుగా ఈ పథకం నిలిచిపోయింది. దీనివల్ల లక్షలాది మంది మహిళలు లబ్ది పొందలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచాలనే ఉద్దేశంతో మళ్లీ మొదలుపెడుతోంది.

దీనివల్ల నవజాత శిశు మరణాల రేటు తగ్గడమే కాదు తల్లులు, వారి కుటుంబాలకు ఆర్ధికంగా సాయం అందనుంది. రీసెంట్‌గా ఆరోగ్య సర్వేలో చిన్నారులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్న తేలడంతో ఈ కిట్ ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ కిట్‌లో 11 రకాల వస్తువులు ఉంటాయి. మార్కెట్లో వాటి విలువ అక్షరాలా రూ.1410 విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

బేబిక దోమతెర బెడ్, వాటర్‌ ప్రూఫ్‌ కాట్‌ షీట్, బేబీ డ్రెస్, బేబీ సబ్బు, పౌడర్, న్యాప్‌ కిన్, టవల్స్, షాంపూ, ఆయిల్, బొమ్మ, తల్లి చేతులు శుభ్రం చేసుకోవడానికి లిక్విడ్ ఉండనుంది. ఈ పథకం కోసం రూ.51 కోట్లు మంజూరు చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన తల్లులు డిశ్చార్జి అయ్యే సమయంలో వాటిని అందజేయనున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×