BigTV English

OTT Movie : మనిషి మాంసాన్ని తినే మాన్స్టర్స్… రోమాలు నిక్కబొడుకునే థ్రిల్లర్ బ్రో

OTT Movie : మనిషి మాంసాన్ని తినే మాన్స్టర్స్… రోమాలు నిక్కబొడుకునే థ్రిల్లర్  బ్రో

OTT Movie : హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ స్టోరీ ఒక ద్వీపం చుట్టూ తిరుగుతుంది. అందులో కొన్ని విచిత్రమైన జీవులు, మనుషులపై దాడులు చేస్తుంటాయి. వీటివల్ల అక్కడ అనుకోని సమస్యలు ఎదురవుతాయి. చివరి వరకు సస్పెన్స్ తో ఈ స్టొరీ మెంటలెక్కిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే


స్టోరీలోకి వెళితే

ఐరిష్ కి చెందిన వాతావరణ శాస్త్రవేత్త, ఒక సముద్ర ద్వీపంలోని వాతావరణ కేంద్రంలో సంవత్సరం పాటు పనిచేయడానికి వస్తాడు. ఈ ద్వీపం ఒంటరిగా, రహస్యంగా ఉంటుంది. అక్కడ అతను గ్రెంజ్ అనే లైట్‌హౌస్ కీపర్‌ను కలుస్తాడు. అతని ప్రవర్తన కూడా చాలా వింతగా ఉంటుంది. గ్రెంజ్ ఒక మానవాకారంలో ఉన్న సముద్ర జీవి అయిన అటెర్ తో కలిసి జీవిస్తుంటాడు. దానితో ఏకాంతంగా కూడా గడుపుతుంటాడు. రాత్రి సమయంలో ద్వీపం చుట్టూ ఉన్న సముద్రం నుండి వచ్చే కొన్ని వింత జీవులు, వాతావరణ శాస్త్రవేత్త అయిన గ్రెంజ్‌పై దాడి చేస్తాయి. ఈ జీవులు మానవులను పోలిన రూపంలో ఉంటాయి. అయితే ఇవి భయంకరమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి మనుషుల మాంసాన్ని కూడా తింటుంటాయి. ఈ దాడుల నుండి బయటపడడానికి ఇద్దరూ కలిసి పోరాడాల్సి వస్తుంది. ఇలా ప్రతీ రోజు రాత్రి వేలల్లో వీటిని కట్టడి చేయడానికి తుపాకులతో ఎదుర్కుంటూ ఉంటారు. ఈ క్రమంలో స్టోరీ ముందుకు సాగే కొద్దీ, వాతావరణ శాస్త్రవేత్త అక్కడి జీవుల గురించి దిమ్మ తిరిగే విషయాలను తెలుసుకుంటాడు. చివరికి ఆ శాస్త్రవేత్త కనిపెట్టిన విషయాలు ఏమిటి ? ఆక్కడ ఉన్న వింత జీవుల పరిస్థితి ఏమౌతుంది ? ఆ దీవి నుంచి వీళ్ళంతా బయట పడతారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాని మిస్ కాకుండా చూడండి.


Read Also : అమ్మాయిల్ని ఆ పని చేసి మరీ చంపే కిల్లర్… వాడికి చుక్కలు చూపించే కళ్ళు కంపించని హీరో

 

జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో

ఈ సైన్స్-ఫిక్షన్ హారర్ సినిమా పేరు ‘కోల్డ్ స్కిన్’ (Cold Skin). 2017 లో వచ్చిన ఈ స్పానిష్ మూవీకి జేవియర్ జెన్స్ దర్శకత్వం వహించారు. ఆల్బర్ట్ సాంచెజ్ పినోల్ రాసిన నవల ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ సినిమా కథ 1914లో, మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో జరుగుతుంది. ఇది ఒక నిర్మానుష్యమైన ద్వీపంలో జరిగే భయంకరమైన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×