Appsc new chairman: ఏపీపీఎస్సీ న్యూ ఛైర్మన్ ఎవరు? ఐపీఎస్‌లకు ఛాన్స్ దక్కేనా? ఐఏఎస్‌లకు కేటాయిస్తుందా? సీనియర్ రాజకీయ నేతలకు కూటమి సర్కార్ అవకాశం లభిస్తుందా? ఇవే ప్రశ్నలకు చాలామందిని వెంటాడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆల్రెడీ కొత్త ఛైర్మన్ ఎంపిక దాదాపుగా పూర్తి అయినట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నారు. ఇంతకీ కొత్త ఛైర్మన్ ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది.
ఏపీలో కూటమి సర్కార్ వచ్చాక కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. చివరకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ సైతం తన పదవికి రాజీనామా చేశారు. మూడు నెలలుగా ఏపీపీఎస్సీకి ఛైర్మన్ లేకుండా పోయింది. దీంతో పలు నోటిఫికేషన్లు సైతం నిలిచిపోయాయి.
పరిస్థితి గమనించిన చంద్రబాబు సర్కార్, కొత్త ఛైర్మన్ కోసం వడపోత మొదలు పెట్టింది. గతంలో రిటైరయిన ఐఏఎస్, ఐపీఎస్‌ల జాబితాను పరిశీలించింది. జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా పని చేసినవారి లిస్టు సైతం తెచ్చుకుంది. వారిలో కొంతమంది రిటైర్మెంట్ తీసుకున్నారు.
ఏబీ వెంకటేశ్వరరావు, ఏఆర్ అనురాధతోపాటు ఐఏఎస్ శ్రీనివాసరావు, మాజీ వీసీ అప్పారావు, యలమంచిలి రామకృష్ణ లాంటి అధికారుల పేర్లు బలంగా వినిపించాయి. కాకపోతే సీఎం చంద్రబాబు మాత్రం ఐపీఎస్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. కేవలం అధికారి మాత్రమేకాదు, గట్టిగా మాట్లాడగలిగే వారిని ఎంపిక చేసినట్టు సమాచారం.
ALSO READ: లడ్డూ వివాదం.. టెన్షన్‌లో వైసీపీ, సీబీఐ లేదా జ్యుడీషియల్? కెమికల్ ఇంజనీర్ల నిపుణలేమంటున్నారు?
దీనికి సంబంధించిన ఫైలు ఇప్పటికే సీఎం కార్యాలయానికి చేరుకుంది. మాజీ ఐపీఎస్ అధికారిని దాదాపుగా ఓకే చేసినట్టు తెలుస్తోంది. రేపోమాపో అధికారిక ప్రకటన రానుంది. మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ సైతం మాజీ ఐపీఎస్ అధికారి వైపు మొగ్గు చూపినట్టు సచివాలయం వర్గాలు చెబుతున్నాయి.