BigTV English

Minister Lokesh: ఏపీకి విదేశీ వర్సిటీలు.. అమరావతిలో బిట్స్‌ క్యాంపస్‌కు భూములు

Minister Lokesh: ఏపీకి విదేశీ వర్సిటీలు.. అమరావతిలో బిట్స్‌ క్యాంపస్‌కు భూములు

Minister Lokesh: తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి లోకేశ్‌. ఏపీకి పెద్దఎత్తున ప్రైవేటు, విదేశీ యూనివర్సిటీలను రప్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అమరావతిలో బిట్స్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందన్నారు. ఇందుకోసం 75 ఎకరాల భూమిని కేటాయించినట్టు తెలిపారు.


ప్రైవేటు బిల్లులకు ఆమోదం

మంగళవారం ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్, 2016లో అప్పటి ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల కోసం చట్టం తీసుకొచ్చిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఆలోచనతో ప్రైవేటు యూనివర్సిటీల స్థాపనకు నిర్ణయం తీసుకుందన్నారు. గతంలో విశాఖలో సెంచూరియన్ యూనివర్సిటీ ఏర్పాటు అయ్యిందన్నారు.


మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్‌ లైన్స్ విరుద్ధంగా ఉన్నాయన్నారు. గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్-100 యూనివర్సిటీలతో జాయింట్ డిగ్రీ ఉండాలన్నారు. జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమమ్ ఇన్ని సంవత్సరాలు యూనివర్సిటీ ఆపరేషన్‌లో ఉండాలని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయని గుర్తు చేశారు. దానికి కాస్త సవరణలు చేయాల్సి వుందన్నారు.

ప్రభుత్వం ఆలోచన

విశాఖలో ఏఐ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ అక్కడే ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.టోక్యో, ఎఎంఇ వర్సిటీ ఫిలిప్పీన్స్ ఆసక్తి కనబర్చాయని తెలిపారు. ఇతర వర్సిటీల ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు. పెద్దఎత్తున ప్రైవేటు రంగంలో భారత్‌లో టాప్ వర్సిటీలతోపాటు విదేశీ యూనివర్సిటీలను ఏపీకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

ALSO READ: జగన్ కు దారేది?

అమరావతిలో బిట్స్‌ పిలానీ సంస్థ ఏర్పాటుకు 70 ఎకరాలు కేటాయించామన్నారు. అలాగే టాటా గ్రూప్, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాసు, యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ వర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వెల్లడించారు.

ఫారెన్ వర్సిటీలు

విద్యా సంస్థలకు అధికంగా ప్రొత్సాహకాలు ఇచ్చి రాయలసీమకు రప్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు మంత్రి లోకేష్. కనిగిరి ప్రాంతానికి ట్రిపుల్ ఐటి ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీని 2022లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేశారన్నారు. దీనివల్ల ప్రొఫెసర్లు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారన్నారని తెలిపారు.

ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతానికి దాతలు ముందుకు వస్తున్నారని గుర్తు చేశారు. ఇందుకోసం ప్రత్యేకమైన మెకానిజం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రైవేటు యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు శాసనసభలో ఆమోదం తెలిపింది.

వాట్సాప్ సర్వీసుల గురించి

వాట్సాప్ సర్వీసుల గురించి మాట్లాడారు మంత్రి లోకేష్. పబ్లిక్ సర్వీసుల గురించి వివిధ దేశాల్లో జరుగుతున్న వాటిని పరిశీలించామన్నారు.ఏఐతో కలిసి సర్వీసు అందజేయాలన్నారు. మార్చి చివరి నాటికి 300 సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.అందులో మూడు రకాల సర్వీసులు అందించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.

సర్టిఫికెట్ కూడా పర్మినెంట్‌గా ఇవ్వాలనే దానిపై ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా క్యూ ఆర్ మాదిరిగా సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. జూన్ చివరినాటికి 500 సర్వీసులు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఫీడ్ బ్యాక్ తీసుకోవాలనే మెకానిజం తీసుకురావాలనుకున్నట్లు తెలిపారు.  మహారాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ సర్వీసుల గురించి తెలుసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  మీ-సేవను బలోపేతం చేస్తామన్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×