Chandrababu Naidu: ఎపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రణ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు మనకు భారం కాదని దేశానికి, రాష్షానికి వారే అసలైన సంపదని అన్నారు. శ్రీకాకులం జిల్లాలోని నరసన్న పేటలో భారీ భహిరంగ సభలో సీఎం చంద్ర బాబు నాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో జనాభా తగ్గుదల రేటును పూర్తిగా అరికట్టడానికి నా వంతుగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని అన్నారు. ప్రభుత్వం కూడా అందుకు కావలసిన ప్రోత్సాహకాలను అందిస్తుందని అన్నారు.
ఇక నుండి రాష్ట్రంలో మూడవ సంతానానికి 30.000 నాల్గవ సంతానానికి 40.000 రూపాయల ఆర్థిక సహయంను అందిస్తానని సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ పథకానికి త్వరలోనే మా కూటమి ప్రభుత్వం విదివిధానాలు రూపొందిచి అమలు చేస్తామని అన్నారు. ఒకప్పుడు నేనే పిల్లను తగ్గించమని చెప్పానని కాని ఇప్పుడు నేనే పెంచడం కోసం కృషిచేస్తానని అన్నారు.
Also read: బిల్డర్ నిర్లక్ష్యం.. బలి తీసుకున్న చిన్నారి ప్రాణం
మరో వైపు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్ధుతం ఈ పథకం కింద పాఠశాల విద్యార్ధులకు అందిస్తున్న 15.000 ఆర్టిక సహయాన్ని దేవుడు దయ ఉంచి భవిష్యత్తులో మన ఆర్థిక పరిస్ధితి మెరుగు పడితే మరింత పెంచేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. దీంతో సభలో ఉన్నటు వంటి వారందరు ఓక్క సారిగా కేకేలు వేసారు.
3వ సంతానానికి రూ.30 వేలు, 4వ సంతానానికి రూ.40 వేలు
పుట్టిన వెంటనే ఇస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం పని చేశాను
కానీ ఈరోజు పిల్లలే సంపద
జనాభా తగ్గిపోవడం వల్ల కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి
– సీఎం చంద్రబాబు
“₹30,000 for the… pic.twitter.com/vzWiBtpbgG
— BIG TV Breaking News (@bigtvtelugu) May 16, 2026
Also read: సింగరేణిలో ఘోర అగ్ని ప్రమాదం.. 3 కోట్లకు పైగా ఆస్తి నష్టం