BigTV English

Chandrababu: పుష్పలో చంద్రబాబు ఫోటో.. సోషల్ మీడియాలో సెటైర్లు.. స్పందించిన టీడీపీ అధినేత..

Chandrababu: పుష్పలో చంద్రబాబు ఫోటో.. సోషల్ మీడియాలో సెటైర్లు.. స్పందించిన టీడీపీ అధినేత..
chandrababu pushpa

Chandrababu: పుష్ప. పుష్ప. పుష్ప. జాతీయ అవార్డులు ప్రకటించినప్పటి నుంచీ మారుమోగిపోతున్న పేరు. తెలుగు నుంచి తొలిసారిగా అల్లు అర్జున్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు రావడంతో అంత ఖుషీగా ఉన్నారు. ఒక్కరోజు గడిచే సరికి కాంట్రవర్సీ మొదలైపోయింది. గిరిజనుల న్యాయం కోసం పోరాడిన జై భీమ్‌ సినిమాకు అవార్డు ఇవ్వలేదు కానీ.. స్మగ్లర్‌గా నటించిన బన్నీకి జాతీయ అవార్డు రావడంపై సోషల్ మీడియాలో తెగ రచ్చ అవుతోంది.


మరోవైపు, పుష్ప సినిమాలో చంద్రబాబు ఫోటో ఉండటంతో.. ఆ ఇమేజ్‌ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మూవీలో అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకు దొరికినప్పుడు.. అక్కడ పోలీస్‌ స్టేషన్‌లో గోడకు చంద్రబాబు ఫోటో ఉంటుంది. అలాగే, మరో సన్నివేశంలోనూ ఆయన ఫోటో కనిపిస్తుంది. ఆ క్లిప్స్‌ లేటెస్ట్‌గా మళ్లీ వైరల్ అవుతున్నాయి.

చంద్రబాబు ఫోటోపై వైసీపీ వర్గీయులు నెగటివ్‌గా ట్రోల్ చేస్తుంటే.. టీడీపీ టీమ్స్ పాజిటివ్‌ కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు సైతం స్పందించారు.


పుష్ప (Pushpa) సినిమాలో తన ఫోటో ఉందని వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారని సెటైర్లు వేశారు చంద్రబాబు. ఆ సినిమాలో చూపించిన కాలంలో.. తాను సీఎంగా ఉన్నాననో.. లేదంటే ఎర్రచందనం స్మగ్లర్లను కంట్రోల్‌ చేశాననో కానీ.. వాళ్లు నా ఫోటో పెట్టి ఉండొచ్చని చెప్పారు. దానికే వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారు ఎద్దేవా చేశారు. ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×