BigTV English

Chandrababu: ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఏ ఫైల్‌పై పెట్టారంటే..?

Chandrababu: ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఏ ఫైల్‌పై పెట్టారంటే..?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా  ప్రమాణస్వీకారం చేసిన తరువాత చంద్రబాబు తొలిసారిగా గురువారం సచివాలయానికి వచ్చారు. తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. సరిగ్గా సాయంత్రం 4.41 గంటలకు తన ఛాంబర్ లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పలు హామీలకు సంబంధించిన ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేశారు.


మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ తోపాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు స్వాగతం పలికారు.

Also Read: జగన్ బొమ్మ ఉన్నా పర్లేదు.. కిట్లు పంపిణీ చేయండి : సీఎం చంద్రబాబు


మొత్తం ఐదు ఫైళ్లపై ఆయన సంతకం చేశారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ పై మొదటి సంతకం చేశారు. ఆ తరువాత, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైల్ పై రెండో సంతకం చేశారు. ఈ యాక్ట్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటు 3వ ఫైల్.. రూ. 4 వేలకు పెన్షన్ల పెంపునకు సంబంధించిన ఫైల్ పై చంద్రబాబు మూడవ సంతకం చేశారు. అనంతరం.. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్ పై నాలుగో సంతకం చేశారు. చివరగా ఐదో సంతకం.. నైపుణ్య గణనకు సంబంధించిన ఫైల్ పై చేశారు.

Related News

AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

AI Scam: ఘరానా మోసం.. AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు

AP Politics: జగన్ టూర్ రిజల్ట్ ఏంటి? బూమరాంగ్ అయ్యిందా? ఆ ఫార్ములాను తెరపైకి తెచ్చారా?

Big Stories

×