BigTV English

Pradeep Vijayan: బ్రేకింగ్.. నటుడు ప్రదీప్ విజయన్ మృతి

Pradeep Vijayan: బ్రేకింగ్.. నటుడు ప్రదీప్ విజయన్ మృతి

Pradeep Vijayan: కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. తమిళ్ సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా నటించి మెప్పించిన ఆయన జూన్ 13 న పాలవాక్కంలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 35 ఏళ్ల ప్రదీప్ కు ఇంకా పెళ్లి కాలేదు. సింగిల్ గా ఒక రూమ్ లో ఉంటున్నాడు.


తేగిడి, మేయాద మాన్, టెడ్డీ, ఇరుంబు తిరైమరియు రుద్రన్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇరుంబు తిరై తెలుగులో అభిమన్యుడు పేరుతో రిలీజ్ అయ్యింది. విశాల్, సమంత నటించిన ఈ సినిమాలో ప్రదీప్ విజయన్ విలన్ గా కనిపించాడు. అర్జున్ కు డబ్బు అందజేసే ఒక బ్యాంక్ మేనేజర్ పాత్రలో అతను కనిపించాడు. ఈ సినిమా తరువాత ప్రదీప్ కు మంచి పాత్రలే దక్కాయి.

ఒంటరిగా ఉంటున్న ప్రదీప్ కు అతని స్నేహితుడు బుధవారం ఉదయం 9.30 గంటలకు అతనికి కాల్ చేయడానికి ప్రయత్నించగా అటునుంచి స్పందన లేదు. ఆ తరువాత, అతని స్నేహితులు కొందరు పదేపదే కాల్ చేసినప్పటికీ కాల్స్ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఒకరికి అనుమానం వచ్చి రూమ్ దగ్గరకు వెళ్లి తలుపు కొత్తగా.. అది ఎంతకు తెరుచుకోలేదు. వెంటనే అతను నీలాంగరై పోలీసులను అప్రమత్తం చేయడంతో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ సంఘటనా స్థలానికి చేరుకొని డోర్ బద్దలుకొట్టి లోపలి వెళ్లగా అప్పటికే ప్రదీప్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.


ప్రదీప్ కొన్నిరోజులుగా కళ్ళు తిరుగుతున్నాయని, శ్వాస అందడం లేదని స్నేహితులతో చెప్పినట్లు వారు తెలిపారు. గుండెపోటు వలన ప్రదీప్ మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా తలకు, చేతులకు గాయాలు ఉండడంతో బాత్ రూమ్ లో పడడం వలన తగిలి ఉంటాయని చెప్పుకొస్తున్నారు. పోలీసులు అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నీలంకరై పోలీసులు.. ప్రదీప్ ది అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారని, ప్రాథమిక విచారణలో ప్రమాదవశాత్తు కిందపడిపోయిన కేసుగా తేలిందని తెలిపారు. ఇక ప్రదీప్ మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×