2024 ఎన్నికల తర్వాత మారిన చంద్రబాబుని చూస్తారంటూ చాలాసార్లు చెప్పారాయన. అవును, నిజంగానే చంద్రబాబు మారారు. గతంలో ఎప్పుడూ అధికారులతో మీటింగ్ లు, సమీక్షలు.. అంటూ బిజీగా కాలం గడిపిన ఆయన.. ఇప్పుడు సమీక్షలతోపాటు జనం మధ్య ఉండటానికి కూడా అంతకంటే ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. తాజాగా తాను వెళ్లిన ప్రతి ఇంటిలో ఆయన పొయ్యి వెలిగిస్తున్నారు. ఆ ఇంట్లోని వారికి తన చేత్తో కాఫీయో, టీయో పెట్టిస్తున్నారు. ఆ అభిమానం చూసి జనం నిజంగానే పొంగిపోతున్నారు. చంద్రబాబు జనంలోకి వెళ్లడమే కాదు, జనంలో కలసిపోతున్నారు.
బాబూ జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో సామాజిక సమానత్వాన్ని ఆచరణలో చూపుతూ సీఎం శ్రీ చంద్రబాబునాయుడు గారు పీ-4కు శ్రీకారం చుట్టారు. 1/1#ChandrababuNaidu #NaraLokesh #TeluguDesamParty #AndhraPradesh #VangalapudiAnitha #HomeMinisterAnitha #VangalapudiAnithaArmy pic.twitter.com/zfPTcoMNBf
— Anitha Vangalapudi (@Anitha_TDP) April 5, 2025
ప్రజల్లో ఉంటేనే..
నాయకుడు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఇంకా చెప్పాలంటే ప్రజల మధ్య ఉండాలి. ముఖ్యమంత్రి అయినా సరే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటేనే ఆ ప్రభుత్వంపై నమ్మకం ఉంటుంది. నేను ప్రజలకు మంచి చేస్తున్నాను కదా, నేను కనపడకపోయినా పర్లేదు, నా మంచి కనపడితే చాలు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ పార్టీకి మంచి చేయదు. 2019 ఎన్నికల ముందు జనంలో కలసిపోయారు జగన్. 2019 నుంచి 2024 మధ్య ఏం జరిగిందో అందరికీ తెలుసు. వివిధ కారణాల వల్ల ఆయన జనం మధ్యకు రాలేదు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఆయన దర్శనభాగ్యం కలిగేది కాదనే ఆరోపణ కూడా ఉంది. చివర్లో ఎన్నికల వేళ హడావిడి చేసినా ఫలితం లేదు. ఈ విషయంలో చంద్రబాబు అలర్ట్ గా ఉన్నారు.
కుటుంబ సభ్యుడిలా..
గతంలో ప్రతి నెలా ఒకటో తేదీన వాలంటీర్లు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేవారు. ఇప్పుడు ఒకటో తేదీ కచ్చితంగా నాయకులు జనంలోకి వెళ్తున్నారు. ప్రతిలబ్ధిదారుడి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ని చేతిలో పెడుతున్నారు. నేరుగా సీఎం చంద్రబాబు కూడా ప్రతి నెలా ఒక్కో జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని నేరుగా కలుస్తున్నారు. వారి కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం కావాలేమో ఆరా తీస్తున్నారు. అంతేకాదు, ఇతర సందర్భాల్లో జనం మధ్యకు వెళ్లినా నేరుగా ఇంటిలోకి వెళ్లి వారిలో ఒకరిగా కలసి పోతున్నారు చంద్రబాబు. గతంలో నాయకులు జనం తమ వద్దకు రావాలనుకునేవారు, కానీ ఇప్పుడు నాయకులే జనం వద్దకు వెళ్లాలని, వారి కుటుంబంలో సభ్యులుగా మారాలనేది కొత్త ఫార్ములా. చంద్రబాబు ఈ ఫార్ములాని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇంటిలోకి వెళ్లడమే కాదు, వంటింట్లోకి వెళ్లి నేరుగా పొయ్యి వెలిగిస్తున్నారు. వారికి టీ పెట్టి ఇస్తున్నారు. స్వయంగా తానే గ్లాసుల్లో పోసి, ప్లేట్ లో పెట్టుకుని తెచ్చిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి తమ ఇంటికి వచ్చి టీ పెట్టి ఇస్తున్నారంటే.. ఆ సన్నివేశాన్ని ఆ కుటుంబం ఎప్పటికీ మరచిపోయే అవకాశం లేదు. సో.. వారు కచ్చితంగా చంద్రబాబుకి, టీడీపీకి అభిమానులుగా మారిపోతారు.
ఎప్పుడో ఎన్నికల సమయంలోనే నాయకులు తమ ఇళ్లకు వస్తుంటారని అనుకుంటారు ప్రజలు. కానీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు టైమ్ ఉన్నా కూడా చంద్రబాబు ఇప్పటినుంచే జనంలోకి వెళ్తున్నారు, వారితో మమేకం అవుతున్నారు. ఈ పరిణామం టీడీపీ నేతలకు కూడా ఆశ్చర్యంగా ఉంది, ఆనందం కలిగిస్తోంది.