BigTV English

Star Hero bought expensive watch: ఖరీదైన వాచ్ కొన్న స్టార్‌ హీరో, ఎన్ని కోట్లంటే..

Star Hero bought expensive watch: ఖరీదైన వాచ్ కొన్న స్టార్‌ హీరో, ఎన్ని కోట్లంటే..
Advertisement

The star hero who bought an expensive watch, how many crores


Salman Khan Bought an Expensive Watch: సినీ హీరోలు ఏది కొనుగోలు చేసినా, ఏది అమ్మినా సరే దానికి సంబంధించిన వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఇట్టే వైరల్ అవుతుంటాయి. సాధారణంగా మనం చేతికి ధరించే వాచ్‌కి ఎంత ఖరీదు పెడుతాం. మహాఅయితే 5వేల నుంచి 50 వేల వరకు పెడుతాం. కానీ తాజాగా ఓ హీరో కొనుగోలు చేసిన వాచ్‌ ఖరీదు చూస్తే మీ మైండ్‌ బ్లాక్‌, రెడ్‌, వైట్ అవ్వకతప్పదు. ఎందుకంటే ఆ స్టార్ హీరో కొనుగోలు చేసిన వాచ్ ఖరీదు అక్షరాల రూ. 23 కోట్లు. అదికూడా బంగారు వజ్రాలతో పొదగబడిన వాచ్‌.

బాలీవుడ్ హీరోలు ఏది చేసినా ముచ్చటేస్తుంది. వీరిలాగా లగ్జరీ లైఫ్‌ ఎంజాయ్ చేయాలనిపిస్తుంటుంది చాలామందికి. కానీ అది ఎవ్వరికి సాధ్యపడదు. ఎందుకంటే వారి మూవీ రెమ్యూనరేషన్ కోట్లల్లో ఉంటుంది కాబట్టి. తాజాగా బాలీవుడ్ హీరో కండల వీరుడు సల్మాన్‌ఖాన్ టాప్‌ హీరోల లిస్ట్‌లో ఉన్నాడు. ఒక్కో మూవీకి ఆయన తీసుకునే రెమ్యూనరేషన్‌ రూ. కోట్లల్లో ఉంటుంది. ఇదే కాకుండా బిజినెస్‌లోనూ, ఎండార్స్‌మెంట్, యాడ్స్‌ రూపంలో కూడా సంపాదించే సల్మాన్‌ భాయ్ లగ్జరీ లైప్‌ని లీడ్ చేస్తుంటారు. అయితే మాములుగా ఆయనకు రిస్ట్ వాచ్‌లు అంటే చాలా ఇష్టం. వాచ్ కలెక్షన్‌లో సల్మాన్‌ భాయ్ ఎప్పుడు ముందువరుసలో ఉంటాడు.


Read More: జపాన్‌లో రష్మిక ఫాలోయింగ్, ఫోటోలతో ఫ్యాన్స్ రచ్చ

అయితే రీసెంట్‌గా సల్మాన్‌ ఖాన్‌ కలెక్షన్‌లోని ఓ వాచ్‌ ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది. ఆయన చేతికి డైమండ్స్‌తో పొదిగి ఉన్న వాచ్‌ ధరించి ఫోటోకు పోజిచ్చారు. అయితే ఈ ఫోటోలో సల్మాన్‌ఖాన్‌ ధరించిన వాచ్‌ అందరిని ఆకర్షిస్తోంది. అయితే సల్మాన్ ఖాన్‌ ధరించే ఖరీదైన వాచ్‌లు ఇవ్వాళ కొత్తేమి కాదు. గతంలోనూ ఇలాంటి ఖరీదైన వాచ్‌లను ధరించాడు. వాటి ఖరీదు కూడా దాదాపు రూ. 4కోట్ల పైమాటే..

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ ప్రముఖ పేజ్‌ ప్రకారం తాజాగా సల్లు భాయ్ ధరించిన వాచ్‌ ఖరీదు అక్షరాల రూ. 23 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అది పాటెక్ ఫిలిప్ రెయిన్‌బో అనే కంపెనీకి చెందిన వాచ్‌ అని సమాచారం. ఈ వాచ్‌లో దాదాపు 130 వజ్రాలు పొదగబడి ఉన్నాయట. దీంతో ఆ వాచ్ ధర తెలిసిన నెటిజన్లు అనేక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అంబానీ లెవల్ రిస్ట్ గేమ్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరో వ్యక్తి ఓన్లీ భాయ్ థింక్స్‌ అంటూ కామెంట్ చేశాడు. ఎవరెన్నీ కామెంట్స్ చేసినా కానీ.. ఎంతమంది భాయ్‌లు వచ్చినా సరే సల్లు భాయ్‌కి ఉండే ఆ లెవలే వేరు కదా.. భాయ్ అంతే.

 

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×