AP Liquor Scam Case : రోజంతా చెవిరెడ్డి న్యూసే. ఉదయం ఆయన్ను ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్న వార్త వైరల్ అయింది. ఆ తర్వాత ఆయన గన్‌మెన్ లేఖ కలకలం రేపింది. అంతా తూచ్ అంటూ మధ్యాహ్నానికి సిట్ రియాక్షన్ వచ్చింది. లిక్కర్ కేసులో మరో ఆరుగురిని చేర్చుతూ సాయంత్రం మరింత షాకింగ్ న్యూస్. ఇలా చెవిరెడ్డి ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ డీటైల్స్ చూస్తే…
చెవిరెడ్డికి చెక్
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే, ఆయనపై అప్పటికే లుకౌట్ నోటీసులు ఉండటంతో సిబ్బంది అడ్డుకున్నారు. ఇంతకీ చెవిరెడ్డి శ్రీలంకకు ఎందుకు వెళ్లాలనుకున్నారు? లిక్కర్ కేసు మెడకు చుట్టుకుంటుందనే భయమా? దేశం విడిచి పారిపోదామని ప్లాన్ చేశారా? అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. చెవిరెడ్డి ఇప్పటికే పోక్సో కేసు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల్లో పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు లిక్కర్ కేసు ఉచ్చు కూడా బలంగా బిగుసుకుంటోంది.
గన్‌మెన్‌కు థర్డ్ డిగ్రీ?
మరోవైపు, చెవిరెడ్డి దగ్గర 10 ఏళ్లు గన్‌మెన్‌గా పని చేసిన మదన్ రెడ్డి సంచలన లేఖ రాశారు. లిక్కర్ స్కామ్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేందకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారని.. తనను టార్చర్ చేసి కొట్టారంటూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకి లెటర్ రాశారు. రూ. 250 కోట్ల నగదు తాను సప్లై చేసినట్లు స్టేట్మెంట్ ఇవ్వాలని వేధించారని ఆరోపించారు. అందుకు తాను ఒప్పుకోకపోతే.. మొహం, వీపు మీద తీవ్రంగా కొట్టారంటూ.. దెబ్బల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానంటూ కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. ఏఆర్ కానిస్టేబుల్ మదన్‌రెడ్డిని సిట్ కొట్టడాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఖండించారు. టైం వచ్చినప్పుడు బదులు ఇస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
సత్యమేవ జయతే..
చెవిరెడ్డి గన్‌మ్యాన్ మదన్ ఆరోపణలపై సిట్ తీవ్రంగా స్పందించింది. సత్యమేవ జయతే అంటూ కీలక ప్రకటన విడుదల చేసింది. విచారణలో మదన్‌ను కొట్టామనేది అవాస్తవమని.. లిక్కర్ కేసుతో చెవిరెడ్డికి సంబంధం ఉందని చెప్పమన్నారన్నది కూడా అవాస్తవమని తెలిపింది. కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ముడుపులు అందాయని.. లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బును ఎన్నికల్లో పంచారని సిట్ స్పష్టం చేసింది.
హైకోర్టులో పిటిషన్
ఏపీ హైకోర్టులోనూ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి పిటిషన్ ఫైల్ చేశారు. లిక్కర్ స్కాం కేసులో విచారణ పేరుతో సిట్ అధికారులు బలవంతంగా వాంగ్మూలాలు సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సిట్ సిబ్బంది భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, విచారణ పారదర్శకంగా జరిగేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.
లిక్కర్ కేసులో మరో ఆరుగురు..
మరోవైపు.. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల జాబితాలో మరో ఆరుగురిని చేర్చింది సిట్. చెవిరెడ్డిని నిందితుల జాబితాలో చేర్చుతూ సిట్ కోర్టులో మెమో దాఖలు చేసింది. A-38గా చెవిరెడ్డి, A-39 చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలను చేర్చింది. A- 34 వెంకటేష్ నాయుడు, A-35గా బాలాజీ కుమార్, A- 36గా యద్దాల నవీన్, A-37 గా హరీష్ యాదవ్ పేర్లు ఉన్నాయి.
Also Read : రోజాకు ఇచ్చిపడేసిన దువ్వాడ మాధురి..
చెవిరెడ్డికి చిక్కులేనా..?
ఇటీవలే ఏపీ కేబినెట్ భేటీలోనూ లిక్కర్ స్కాంపై చర్చ జరిగింది. ఈ అంశంపై ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు. విచారణ బృందానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని చెప్పారు. ఇప్పటికే జగన్‌కు సన్నిహితులైన.. రాజ్ కెసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితరులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు చెవిరెడ్డి చుట్టూ తిరుగుతోంది ఏపీ లిక్కర్ స్కాం కేసు.